AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లూటో వామన గ్రహమా? అసలు గ్రహమా?.. వివాదంపై నాసా అడ్మినిస్ట్రేటర్ సంచలన వ్యాఖ్యలు!

ఖగోళ శాస్త్ర ప్రపంచంలో గత రెండు దశాబ్దాలుగా నలుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. "ప్లూటో గ్రహమా? కాదా?". 2006లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించినప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మళ్ళీ ప్రాణం పోశాయి.

ప్లూటో వామన గ్రహమా? అసలు గ్రహమా?.. వివాదంపై నాసా అడ్మినిస్ట్రేటర్ సంచలన వ్యాఖ్యలు!
Pluto Planet
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 08, 2026 | 7:43 PM

Share

ఖగోళ శాస్త్ర ప్రపంచంలో గత రెండు దశాబ్దాలుగా నలుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. “ప్లూటో గ్రహమా? కాదా?”. 2006లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించినప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మళ్ళీ ప్రాణం పోశాయి.

అమెరికా సెనేట్ విచారణలో పాల్గొన్న ఐజాక్‌మాన్, ప్లూటోకు తిరిగి గ్రహ హోదా కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్లూటోను కనుగొన్న శాస్త్రవేత్త క్లైడ్ టోంబా కృషిని గౌరవించాలని, అలాగే ప్లూటో భౌగోళిక విశిష్టతలను విస్మరించకూడదని ఆయన వాదించారు. ప్రస్తుతం నాసా ఈ విషయంలో లోతైన పరిశోధనలు చేస్తోందని ఆయన వెల్లడించడంతో ఖగోళ ప్రపంచంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

2006లో IAU ఒక ఖగోళ వస్తువును ‘గ్రహం’గా గుర్తించడానికి మూడు ప్రధాన నియమాలను రూపొందించింది.

1. అది సూర్యుని చుట్టూ తిరగాలి.

2. అది తగినంత ద్రవ్యరాశిని కలిగి ఉండి, గోళాకారంలో ఉండాలి.

3. అది తన కక్ష్యలో ఉన్న ఇతర చిన్న వస్తువులను తొలగించి, ఆ మార్గాన్ని క్లియర్ చేయాలి.

ప్లూటో తన కక్ష్యను క్లియర్ చేయలేకపోవడం అంటే దాని కక్ష్యలో ఇతర కైపర్ బెల్ట్ వస్తువులు ఉండటం వల్ల దాన్ని ‘డ్వార్ఫ్ ప్లానెట్’గా వర్గీకరించారు.

ఐజాక్‌మాన్ ప్రతిపాదనపై శాస్త్రీయ సమాజం రెండుగా విడిపోయింది. ప్లూటోకు సొంత వాతావరణం, పర్వతాలు, సంక్లిష్టమైన భౌగోళిక నిర్మాణం, ఐదు ఉపగ్రహాలు ఉన్నాయని, ఇవన్నీ దానిని ఒక గ్రహంగా పరిగణించడానికి సరిపోతాయని వాదిస్తున్నారు. కేవలం కక్ష్యను క్లియర్ చేయడం అనే నిబంధన అశాస్త్రీయమని కొందరు భావిస్తున్నారు. ఇదిలావుంటే, ఒకవేళ ప్లూటోను గ్రహంగా గుర్తిస్తే, సౌర కుటుంబంలోని ఎరిస్, సెరెస్, మేక్‌మేక్ వంటి మరిన్ని వామన గ్రహాలను కూడా గ్రహాలుగా గుర్తించాల్సి వస్తుంది. ఇది పాఠ్యపుస్తకాల్లో గందరగోళానికి దారితీస్తుందని వారి వాదన.

సాధారణ ప్రజల్లో ప్లూటో పట్ల ఇప్పటికీ ఒక రకమైన ‘నోస్టాల్జిక్’ అనుబంధం ఉంది. నేటికీ చాలా మంది ప్లూటోను 9వ గ్రహంగానే చూడాలనుకుంటున్నారు. నాసా ఇప్పుడు ప్లూటో ఉపరితలం, దాని కక్ష్య తీరుపై కొత్త డేటాను విశ్లేషిస్తోంది. ఒకవేళ నాసా నివేదిక బలమైన శాస్త్రీయ ఆధారాలను చూపగలిగితే, IAU తన నిబంధనలను సవరించక తప్పదు. “ఇది కేవలం పేరుకు సంబంధించిన యుద్ధం కాదు, ఖగోళ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునే విధానానికి సంబంధించిన పరీక్ష.” గా నిపుణులు భావిస్తున్నారు.

ప్లూటో మళ్ళీ గ్రహంగా మారుతుందా లేదా అనేది నాసా ఇచ్చే తుది నివేదికపై ఆధారపడి ఉంది. ఒకవేళ అది జరిగితే, దశాబ్ద కాలం తర్వాత మన సౌర కుటుంబం మళ్ళీ “నవగ్రహాల” కుటుంబంగా మారుతుంది. అంతవరకు ప్లూటో ఒక వివాదాస్పద సుందర లోకంగానే మిగిలిపోనుంది మ.రి రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలు ప్లూటోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..!

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us