Tollywood : అతడికి 61, ఆమెకు 27 ఏళ్లు.. తనకంటే 25 ఏళ్ల చిన్న అమ్మాయితో టాలీవుడ్ విలన్ ప్రేమ..
ప్రేమకు వయసుతో సంబంధమే లేదు. ఏ వయసులోనైనా.. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. ఇక సెలబ్రెటీల వి,యంలో ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వయసుతో సంబంధమే లేకుండా సినీతారల ప్రేమలు, పెళ్లిళ్లు జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరో కమ్ విలన్ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తనకంటే 25 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు అతడు. ఇంతకీ ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత విలన్ పాత్రలతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ సమయంలోనే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అతడు.. కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అతడు.. మరోసారి విలన్ పాత్రలతో అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతడి ప్రేమకథ గురించి నెట్టింట వైరలవుతుంది. అతడు మరెవరో కాదు.. పృథ్వీరాజ్.. అలియాస్ బబ్లూ. 1987లో విడుదలైన ‘ఒరు తాయిన్ సబతం’ చిత్రంలో బబ్లూ కథానాయకుడిగా నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. బబ్లూ 1994లో బీనాను వివాహం చేసుకున్నారు. 18 ఏళ్ల వివాహ బంధం తర్వాత, 2022లో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత, తాను శీతల్‌తో ప్రేమలో ఉన్నానని బబ్లూ ప్రకటించారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
అయితే అతడు తన ప్రేమ విషయం వెల్లడించినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బబ్లూ స్పందిస్తూ.. “నేను శీతల్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు, మరి మీకేంటి సమస్య?” అని ప్రశ్నించారు. “శీతల్ మానసికంగా చాలా పరిణతి చెందినది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మేము మానసికంగా, మేధోపరంగా ఒకేలా ఆలోచిస్తాము. ఆమె ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నేను మానసికంగా యువకుడిని,” అని బబ్లూ చెప్పాడు. శీతల్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిమ్ ట్రైనర్. అయితే ఇటీవల వారిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జిరగింది. కానీ చివరికి, శీతల్ సుమేష్‌ను వివాహం చేసుకుంది. అతను ఒక జిమ్ ట్రైనర్. మలయాళీ.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో శీతల్ మాట్లాడుతూ, “దేనిపైనా ముందుగానే ఒక అభిప్రాయానికి రాకండి. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు కూడా చెబుతున్నాను. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మీకు నచ్చితే కలిసి ఉండండి. నచ్చకపోతే విడిపోండి. దేనిపైనా ముందుగానే ఒక అభిప్రాయానికి రాకండి.” అని అన్నారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
బబ్లూ పృథ్వీరాజ్..

Babloo. Prithviraj
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
