Motorola G14: మోతమోగిస్తున్న మోటోరోలా.. అదిరే ఫీచర్లతో.. అతి తక్కువ ధరలోనే కొత్త స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవి..
మోటోరోలా మాత్రం వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరాలు, 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ట్-ఎనేబుల్డ్ స్టీరియో స్పీకర్‌లతో సహా కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లతో ఫోన్ ప్యాక్ చేసింది. రెడ్ మీ కూడా మోటో జీ14కి పోటీగా 4జీ వేరియంట్ ఫోన్ లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మోటోరోలా జీ14కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
మోటోరోలా చవకైన ధరలో ఓ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా ఇదే సమయంలో రెడ్ మీ కూడా ఓ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం 5జీ సపోర్టుతో వస్తోంది. అయితే మోటోరోలాలో మాత్రం వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరాలు, 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ట్-ఎనేబుల్డ్ స్టీరియో స్పీకర్‌లతో సహా కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లతో ఫోన్ ప్యాక్ చేసింది. రెడ్ మీ కూడా మోటో జీ14కి పోటీగా 4జీ వేరియంట్ ఫోన్ లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు లాంచ్ అవుతున్న మోటోరోలా జీ14కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటో జీ14 స్పెసిఫికేషన్లు ఇలా.. ఈ స్మార్ట్ ఫోన్ నలుపు, నీలం రంగులలో అందుబాటులో ఉంటుంది. డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్‌ను గమనించవచ్చు. దీనిలో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ స్పీకర్లు, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది యునిసోక్ టి616 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. దీనిని ఆండ్రాయిడ్ 14కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల వరకూ సేఫ్టీ అప్ డేట్లు ఉంటాయి.
మోటో జీ14 కెమెరా సెటప్..ఈ ఫోన్ వెనుకవైపు, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో మాక్రో కెమెరా ఉంటాయి. ఫోన్ 20W ఛార్జింగ్ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 34 గంటల టాక్ బ్యాక్ టైమ్‌ను అందిస్తుందని మోటోరోలా పేర్కొంది. అయితే ఇవి వినియోగదారుల వాడకాన్ని మారుతంటాయి.
మోటో జీ14 ధర, లభ్యత.. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ల ఆధారంగా, భారతదేశంలో ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాత-తరం Moto G13 ఫ్లిప్‌కార్ట్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ కోసం రూ.9,499కి అందుబాటులో ఉంది.
రెడ్ 12 ఎలా ఉంటుందంటే..
మోటో జీ14, రెడ్ మీ 12 5జీ రెండు ఫోన్లు ఫ్రేమ్ డిజైన్ సమానంగా ఉంటుంది. అయితే నిర్మాణ నాణ్యతలో కొంచెం తేడాలు ఉండవచ్చు. రెడ్ మీ ఫోన్ క్వాల్కమ్ 5జీ ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీనిలోని బ్యాటరీ 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ రెడ్ 12 5జీ ఫోన్ ధర రూ. 15,000 నుంచి రూ. 20,000లోపు ఉండొచ్చు. అదే సమయంలో రెడ్ 12 ఫోన్ నే 4జీ వేరియంట్లో కూడా లాంచ్ అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే దాని ధర రూ. 15,000లోపు ఉండొచ్చు. అప్పుడు అది మోటో జీ14కి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..