Reliance JioBook: రిలయన్స్ జియో సంచలనం.. ఐఫోన్ కన్నా తక్కువ ధరలో ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే!

కొత్త ల్యాప్ టాప్ లో ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ 8788 ప్రాసెసర్ ఉంటుంది. ఇది బ్లూ కలర్ షేడ్ లో, ఎంబడెడ్ జియో సిమ్ తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్ డీఎంఐ మినీ పోర్ట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో గరిష్టంగా 8 గంటలు నాన్ స్టాప్ గా పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు మంచి ఎంపికగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Reliance JioBook: రిలయన్స్ జియో సంచలనం.. ఐఫోన్ కన్నా తక్కువ ధరలో ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే!
Reliance Jiobook(2023)
Follow us
Madhu

|

Updated on: Aug 01, 2023 | 1:38 PM

ముఖేష్ అంబానీకి చెందిన రిలయ్స్ జియో ఒక సెన్సేషన్. టెలికాం రంగంలో అత్యంత చవకైన ధరలో సూపర్ బెనిఫిట్స్ అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇదే క్రమంలో మరో ఉత్పత్తిని రిలయన్స్ జియో తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ల్యాప్ టాప్ ను పరిచయం చేసింది. రిలయన్స్ జియో బుక్-2023 పేరిట జూలై 31న మార్కెట్లోకి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇది భారతదేశంలో అందుబాటులులో ఉన్న 4జీ కనెక్టివిటీ కలిగిన ల్యాప్ టాప్ లలో చవకైన ల్యాప్ టాప్ అని రిలయన్స్ ప్రకటించింది. వాస్తవానికి రిలయన్స్ జియో నుంచి వచ్చిన రెండో ల్యాప్ టాప్ ఇది. ఇంతకు ముందు జియోబుక్2022 పేరట ఓ ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా జియోబుక్2023ని ఆవిష్కరించింది. కొత్త ల్యాప్ టాప్ లో ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ 8788 ప్రాసెసర్ ఉంటుంది. ఇది బ్లూ కలర్ షేడ్ లో, ఎంబడెడ్ జియో సిమ్ తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్ డీఎంఐ మినీ పోర్ట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో గరిష్టంగా 8 గంటలు నాన్ స్టాప్ గా పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు మంచి ఎంపికగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియోబుక్-2023 ధర, లభ్యత.. కొత్త జియోబుక్ ధర రూ. 16,499. ఈ ల్యాప్‌టాప్ బ్లూ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్, రిలయన్స్ డిజిటల్ తో పాటు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది . ఇది ఆగస్టు 5 నుంచి అమ్మకానికి వస్తుంది.

జియోబుక్-2023 స్పెసిఫికేషన్‌లు.. ఈ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీనిలో 11.6 అంగుళాల హెచ్ డీ, 768X1,366 పిక్సెల్స్ కలిగిన డిస్ ప్లే ఉంటుంది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంది. దీనిలో అంతర్నిర్మిత 4జీ సిమ్ కార్డ్‌ ఉంటుంది. ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ8788 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీతో ఈ ల్యాప్ టాప్ వస్తోంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256జీబీ వరకూ స్టోరేజ్ ను విస్తరించవచ్చు. ఇంతకు ముందు లాంచ్ లాంచ్ చేసిన జియో బుక్ అడ్రెనో 610 జీపీయూ, 2జీబీ ర్యామ్, 32జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ తో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది.

ఇవి కూడా చదవండి

జియోబుక్-2023 కనెక్టివిటీ.. ఈ ల్యాప్ టాప్ లోని కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే వైఫై, బ్లూటూత్ 5, హెచ్డీఎంఐ మినీ స్టోర్, 3.55ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను ప్యాక్ చేస్తుంది. 2-మెగాపిక్సెల్ వెబ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఎనిమిది గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. జియోబుక్ 2023 అనే బరువు చాలా తక్కువ కేవలం 990 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది గత మోడల్ కంటే చాలా తక్కువ.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..