Moto E32s: తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌తో వస్తున్న Moto E32s స్మార్ట్‌ఫోన్ Android 12లో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20: 9, రిఫ్రెష్ రేట్ 90Hzగా నిలిచింది.
Moto E32s స్మార్ట్‌ఫోన్ గురువారం భారతదేశంలో విడుదలైంది. కొత్త Motorola ఫోన్ మునుపటి Moto E32కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా విడుదలైంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో విడులైంది. Octa-core MediaTek Helio G37 ప్రాసెసర్ Moto E32sలో అందించారు. ఇది ఆండ్రాయిడ్ 12తో పని చేస్తోంది. రెండేళ్లపాటు యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఫోన్ IP52-సర్టిఫైడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. Moto E32s బడ్జెట్ కేటగిరీలో Redmi 10A, Realme C31, Redmi 10 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
భారతదేశంలో Moto E32s ధర..
మోటో ఈ32ఎస్ బేస్ వేరియంట్ 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ భారతదేశంలో రూ. 8,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ప్రారంభ ధర ఎంతకాలం చెల్లుబాటవుతుంది అనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు. ఫోన్ 4GB + 64GB మోడల్‌లో కూడా వస్తుంది. దీని ధర రూ.9,999గా నిలిచింది. మీరు Moto E32లను మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్, రిలయన్స్ డిజిటల్ నుంచి జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయగలదు.
Moto E32s స్పెసిఫికేషన్‌లు..
డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌తో వస్తున్న Moto E32s స్మార్ట్‌ఫోన్ Android 12లో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20: 9, రిఫ్రెష్ రేట్ 90Hzగా నిలిచింది.
MediaTek Helio G37 ప్రాసెసర్‌తో 4GB LPDDR4X RAMతో ఈ ఫోన్ విడుదలైంది. Moto E32s ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇది f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, Moto E32s f/2.0 లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక, ముందు కెమెరాలు రెండూ పోర్ట్రెయిట్, పనోరమా, ప్రో, నైట్ విజన్ మోడ్‌లను కలిగి ఉంటాయి. వెనుక కెమెరాలో LED ఫ్లాష్ కూడా ఉంది. ఇది 30fps వద్ద పూర్తి HD వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Moto E32s స్మార్ట్‌ఫోన్ 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్‌లో 10W ఛార్జర్ అందించారు. ఫోన్ బరువు 185 గ్రాములు.
Moto E32sలో కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.