Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్ ఉన్నాయా? యమ డేంజర్..వెంటనే డిలీట్ చేసుకోండి!
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు..

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కొన్ని యాప్‌ల కారణంగా ప్రమాదం పొంచి ఉంటుందని గూగుల్ చెబుతోంది. కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంటుంది.
Google Play Store వినియోగదారులను రక్షించడానికి అనేక యాప్‌లను కూడా తొలగిస్తుంది. వినియోగదారులు నివేదించిన నకిలీ యాప్‌లు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తొలగించుకోవడం మంచిది. తాజాగా 18 యాప్‌లు తొలగించింది గూగుల్. అలాంటి యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ సూచిస్తోంది. ఈ అన్ని మొబైల్ యాప్‌లలో స్పైలోన్ మాల్వేర్ గుర్తించింది గూగుల్. ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వ్యక్తిగత వివరాలతో పాటు డేటాను దొంగిలిస్తుంటాయి.
SpyLoan ఎలా పని చేస్తుంది?
SpyLoan అనేది ఈ 18 యాప్‌లలో కనిపించే ఒక రకమైన మాల్వేర్. ఇది ఏదైనా వినియోగదారు ఫోన్ నుండి డేటాను దొంగిలించగలదు. ఫోన్‌లో ఉన్న ఏదైనా సమాచారం హ్యాకర్లకు అందుబాటులో ఉంటుంది. మీ సందేశాలను కూడా చదవగలరు. ఈ మాల్వేర్ వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయగలదు. భారతదేశం, అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన వినియోగదారులు స్పైలోన్ బాధితులు. కాబట్టి Google ఇప్పటికే తీసివేసిన యాప్‌లను ఇప్పుడు మీ ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
ఏయే యాప్స్ తొలగించారంటే..
- AA Credit
- Love Cash
- GuayabaCash
- EasyCredit
- Dinner
- CrediBus
- FlashLoan
- LoansCredit
- Credit Loans-YumiCash
- Go Credit
- Instant Loan
- large wallet
- Fast Credit
- Finupp Lending
- 4S Cash
- TrueNaira
- EasyCash
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి