నథింగ్ ఫోన్ 2ఏ.. ఇది మార్చి 5వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా మాడ్యూల్, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీలో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న చవకైన ఫోన్ ఇదే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.