బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గాయి సరే..! మరి ఏ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోండి!
HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. వీటిలో ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీతో, త్వరగా లోన్ పొందవచ్చో తెలుసుకుందాం. రూ.30 లక్షల రుణానికి రెండు బ్యాంకుల EMI, మొత్తం వడ్డీని పోల్చడం ద్వారా మీ కలల ఇంటి కోసం ఉత్తమ ఎంపికను నిర్ణయించుకోవచ్చు.

దేశంలోని ప్రముఖ బ్యాంకులు HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే వీటిలో ఎందులో లోన్ ప్రాసెస్ త్వరగా అవుతుంది. ఏ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ ఈజీగా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దాదాపు ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటారు, కానీ ఈ రోజుల్లో ఆస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటువంటి పరిస్థితిలో సామాన్యులకు సొంత ఇల్లు కొనడం చాలా కష్టంగా మారింది. ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకు నుండి గృహ రుణం తీసుకొని ఇల్లు కొనాలనే తమ కలను నెరవేర్చుకుంటున్నారు .
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ తన కస్టమర్లకు 7.90 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. కస్టమర్ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారవచ్చు.
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు BOB గృహ రుణాల వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుంటే, BOB తన కస్టమర్లకు 7.45 శాతం ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను బట్టి కూడా మారవచ్చు.
మీరు HDFC బ్యాంక్ నుండి 15 సంవత్సరాల కాలానికి రూ.30 లక్షల గృహ రుణం తీసుకొని 7.90 శాతం వడ్డీ రేటుతో ఈ రుణం పొందినట్లయితే, మీరు ప్రతి నెలా రూ.28,497 EMI చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.51.29 లక్షలు బ్యాంకుకు చెల్లిస్తారు. మొత్తం రూ.21.29 లక్షల వడ్డీని చెల్లిస్తారు.
మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 15 సంవత్సరాల కాలానికి రూ.30 లక్షల గృహ రుణం తీసుకొని 7.45 శాతం వడ్డీ రేటుతో ఈ రుణం పొందినట్లయితే, మీరు ప్రతి నెలా రూ. 27,725 ఈఎంఐ చెల్లించాలి. 15 సంవత్సరాలలో మొత్తం రూ.49.90 లక్షలు బ్యాంకుకు చెల్లిస్తారు. మొత్తం రూ.19.90 లక్షల వడ్డీని చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




