Microsoft: విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

Microsoft: విండోస్‌ ప్రింట్‌ స్పూలర్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. ప్రింట్‌ స్పూలర్‌ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్ల..

Microsoft: విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2021 | 8:15 AM

Microsoft: విండోస్‌ ప్రింట్‌ స్పూలర్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. ప్రింట్‌ స్పూలర్‌ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్‌ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ప్రింట్‌ స్పూలర్‌ కోడ్‌కు సంబంధించిన లోపాల కారణంగా విండోస్‌కు సంబంధించిన అన్ని వెర్షన్లకు ప్రమాదం పొంచి ఉందని, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నామన్నారు. లేటెస్ట్‌ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోని వాళ్లు ప్రింట్‌ స్పూలర్‌ని డిసేబుల్‌ చేయడం మంచిదని సూచించింది. అయితే ప్రింట్‌ స్పూలర్‌తో ప్రమాదం ఉన్నందున డేటాపై సైబర్‌ నేరగాళ్లు కన్నేయడంతో సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఇవీ కూడా చదవండి:

అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి

Drones: విపత్తుల సమయంలో మనుషులను రక్షించేందుకు సహకరించే డ్రోన్..ఇది శబ్దాల్లో తేడాలను గుర్తిస్తుంది!