Instagram Stories: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్.
Instagram Stories: ప్రతిభ ఉన్న వారికి ఇప్పుడు సోషల్ మీడియానే ఒక ఆదాయ వనరుగా మారుతోంది. ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్ ద్వారా డబ్బులను ఆర్జించొచ్చని మనకు తెలుసు. అయితే సోషల్ మీడియా సైట్లు కూడా ఈ సదవకాశాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి...

Instagram Stories: ప్రతిభ ఉన్న వారికి ఇప్పుడు సోషల్ మీడియానే ఒక ఆదాయ వనరుగా మారుతోంది. ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్ ద్వారా డబ్బులను ఆర్జించొచ్చని మనకు తెలుసు. అయితే సోషల్ మీడియా సైట్లు కూడా ఈ సదవకాశాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఇప్పటికే సూపర్ ఫాలో అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌కూడా ఇదే బాటలో నడవనుంది. ఇందులో భాగంగానే క్రియేటర్లు తాము చేసే పోస్టుల ఆధారంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కలిపించనుంది ఇన్‌స్టాగ్రామ్.
ట్విట్టర్ తీసుకొచ్చిన సూపర్ ఫాలో ఫీచర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ అనే ఫీచర్‌ను తీసుకొస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచి క్రియేటర్ బ్యాడ్జ్ సాధించిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే వీరు పోస్ట్ చేసే స్టోరీలను కూడా అందరూ చూడలేరు. డబ్బులు చెల్లించి మెంబర్ షిప్ తీసుకున్న వారు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పించారు. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించినా తర్వాత డబ్బులు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక క్రియేటర్స్ పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను స్క్రీన్ షాట్‌లను తీసుకునే అవకాశం ఉండదు. మరి ఈ కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Instagram New Feature
Also Read: Microsoft: విండోస్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచన
Reliance Jio Data Loan: జియో కొత్త ఆఫర్.. అత్యవసర సమయంలో డేటా లోన్ తీసుకోవచ్చు.. వివరాలు




