India Drone guard: ఇజ్రాయెల్ డ్రోన్ గార్డ్ వ్యవస్థను కొనుగోలు చేయనున్న భారత్..? జమ్మూ డ్రోన్ దాడి నేపథ్యంలో..
India Drone guard: జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగి డ్రోన్ దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ మిలిటరీ చరిత్రలో తొలి డ్రోన్ దాడిగా భావిస్తోన్న ఈ అటాక్‌తో దేశ రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయ్యిందా.? దేశంలోకి వచ్చే శత్రు దేశాల..
India Drone guard: జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగి డ్రోన్ దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ మిలిటరీ చరిత్రలో తొలి డ్రోన్ దాడిగా భావిస్తోన్న ఈ అటాక్‌తో దేశ రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయ్యిందా.? దేశంలోకి వచ్చే శత్రు దేశాల డ్రోన్‌లను ధ్వసం చేసే సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు భారత్ అడుగులు వేస్తోందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ చేసిన ఓ ప్రకటన ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను(సీ–యూఏఎస్)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) ఇటీవల ప్రకటించింది. ఐఏఐ సదరు దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ, ఇటీవల భారత్‌లో జరిగిన డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తమ దేశానికి చెందిన డ్రోన్ వ్యవస్థపై భారత్ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఉన్నతధికారి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. మరి భారత్ ఈఎల్ఐ-4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను నిజంగానే కొనుగోలు చేయనుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇంతకీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే..
ఈ డ్రోన్ వ్యవస్థలో షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ వేరియంట్లు ఉంటాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లు ఏకంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్‌లను కూడా అడ్డుకోగలదు. నలువైపుల నుంచి వచ్చే డ్రోన్‌లను అడ్డుకునే సామర్థ్యం ఈఎల్‌ఐ-4030 వ్యవస్థ ప్రత్యేకత. ఈ డ్రోన్ గార్డ్ వ్యవస్థతో మనవైపు వచ్చే డ్రోన్‌లను వెనక్కి పంపొచ్చు దీనిని సాఫ్ట్ కిల్ అంటారు. డ్రోన్లను పూర్తిగా పేల్చేయడాన్ని హార్డ్ కిల్ అంటారు. ఈ డ్రోన్ వ్యవస్థతో సీ– యూఏఎస్ చిన్న, సూక్ష్మ డ్రోన్‌ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, ఒక రక్షణ వలయాన్ని కలిపిస్తుంది. ఇక ఈ వ్యవస్థలోని జామింగ్ ఫీచర్ దాడికి వచ్చిన డ్రోన్స్ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్ అయ్యేలా చేస్తుంది.