Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ

India Corona Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్తా..

Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ
COVID-19 Vaccine India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 04, 2021 | 9:32 AM

India Corona Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్తా.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు దిగువన ఉన్నాయి. అయితే.. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందన్న సూచనలతో.. కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంచేసింది. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రధాన ఆయుధం కావడంతో.. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు వ్యాక్సిన్ ఉత్పత్తిపై కూడా దృష్టిసారించి వ్యాక్సినేషన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ మరో మైలురాయిని సాధించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా35 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా మోతాదులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజే దాదాపు ఆరు మిలియన్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల కేటగిరిలో 28,33,691 మందికి మొదటి, మరో 3,29,889 మందికి రెండో డోసు వేసినట్లు తెలిపింది. మూడో విడుత టీకా డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేటగిరిలో మొత్తం 9,94,34,862 మంది తొలి, మరో 27,12,794 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది.

Also Read:

Covid-19 vaccine: అలాంటి వారందరికీ ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు.. కరోనా నుంచి రక్షణ: ఐసీఎంఆర్

Viral News: సైనస్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లిన ఓ యువతికి షాక్.. 22 ఏళ్ల నుంచి చెవిలో చిక్కుకున్న వస్తువు..