India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో (శనివారం) కొత్తగా 43,071 మంది

India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?
Coronavirus India
Follow us

|

Updated on: Jul 04, 2021 | 10:19 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో (శనివారం) కొత్తగా 43,071 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 955 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433 కు చేరగా.. మరణాల సంఖ్య 4,02,005 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. శనివారం 52,299 మంది బాధితులు కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,96,58,078 కి పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,85,350 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97 శాతం దాటింది.

కాగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 18,38,490 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 41,82,54,953 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకూ.. దేశంలో 41,82,54,953 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.

Also Read:

King Cobra: కింగ్ కోబ్రా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Delta Variant: వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్.. 98 దేశాల్లో గుర్తింపు .. నివారణ చర్యలను సూచించిన డబ్ల్యుహెచ్ఒ చీఫ్