- Telugu News Photo Gallery Viral photos King cobra attacks humans rarely here full details about snake
King Cobra: కింగ్ కోబ్రా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
కింగ్ కోబ్రా..ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము.. దీనినే నల్ల త్రాచు.. రాచనాగు అని కూడా అంటారు. ఇటీవల తిరవనంతపురం జూకు చెందిన జూ కీపర్ రాజు ఈ పాము కాటుకు గురైన మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయట. ఈ పాము గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.
Updated on: Jul 03, 2021 | 8:03 PM

ఈ కింగ్ కోబ్రా విషం మానువుని మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ఇది దాదాపు 20 సంవత్సరాలు జీవిస్తుందని నిపుణులు అంటున్నారు.

అయితే ఈ కింగ్ కోబ్రా మానవులపై చాలా అరుదుగా దాడి చేస్తుందట. ఇప్పటివరకు ఈ పాము కాటుకు కేవలం నలుగురు మాత్రమే చనిపోయారని స్నేక్ పీడియా జట్టు సభ్యుడు సందీప్ దాస్ తెలిపారు.

పాము.. మానవ శరీరంపై ఎలా దాడిచేస్తుందో స్పష్టంగా తెలియదని.. అందుకే పాములను బంధించే సమయంలో చాలా జాగ్రత్తగా మార్గదర్శకాలను పాటించాలని అన్నారు.

అన్ని పాముల కంటే ఈ కింగ్ కోబ్రా విషం అత్యంత ప్రమాదకరం. ఇది ఒక్కసారి కాటు వేస్తే.. మనిషి ప్రాణాలు పోవాల్సిందే. ఇవి ఎక్కువగా అడవులలో మాత్రమే ఉంటాయి.

ఈ కింగ్ కోబ్రా ఒకేసారి 20 మందిని చంపడానికి విషాన్ని బయటకు తీస్తుంది. అయితే కింగ్ కోబ్రా విషానికి విరుగుడు మన ఇండియాలో లేదు. కేవలం థాయ్లాండ్లో యాంటీ విషం అందుబాటులో ఉంది.




