Mi Fast Charger: భారత్‌లో విడుదల కానున్న ఎంఐ కొత్త ఫాస్ట్ ఛార్జర్.. దీని ప్రత్యేకతలు ఇవే..!
Mi Fast Charger: ఎంఐ ఫోన్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొబైళ్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సంస్థ త్వరలో ఒక ఫాస్ట్ ఛార్జర్‌ను..
Mi Fast Charger: ఎంఐ ఫోన్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొబైళ్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సంస్థ త్వరలో ఒక ఫాస్ట్ ఛార్జర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎంఐ 11 అల్ట్రా ఫోన్ కోసం రూపొందించిన 67W ఫాస్ట్ ఛార్జర్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని షియోమి సంస్థ కూడా ఖరారు చేసింది. గత నెలలోనే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ దేశంలో విడుదలైంది. అయితే షియోమి 67W ఫాస్ట్ ఛార్జర్‌కు బదులుగా.. ఎంఐ 11 అల్ట్రా ఫోన్ రిటైల్ బాక్స్‌లో 55W అడాప్టర్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఛార్జర్ ద్వారా 0 నుంచి 99 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు గంట సమయం పడుతుంది. మొబైల్‌తో పాటు ఇచ్చిన అడాప్టర్‌తో పోలిస్తే ఫాస్ట్ ఛార్జర్‌తో అరగంట వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ వైర్డ్ ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అతి త్వరలోనే భారత్‌లో మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఎప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త ఛార్జర్ ఇవ్వడానికి బదులుగా.. దాన్ని విడిగా అమ్మాలని కంపెనీ భావిస్తోంది. 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఎంఐ 11 అల్ట్రా యూనిట్‌కు విభిన్నంగా ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న ఎంఐ 11 అల్ట్రా ఫోన్‌తో రిటైల్ బాక్స్ 55 డబ్ల్యూ ఛార్జర్‌ను ఇస్తున్నారు. దీని స్థానంలో 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై షియోమీ క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ప్రకటించలేదు. అయితే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 67 డబ్ల్యూ వైర్లెస్ ఛార్జర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్ ఇతర డివైజ్‌లను కూడా 10డబ్ల్యూ వేగంతో ఛార్జ్ చేయగలదు.