AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy Book Flex 2 Alpha: శామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్‌ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌

Samsung Galaxy Book Flex 2 Alpha: స్మార్ట్‌ డివైజ్‌ల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న శామ్‌సంగ్ మరో కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ బుక్..

Samsung Galaxy Book Flex 2 Alpha: శామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్‌ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌
Samsung Galaxy Book Flex 2 Alpha
Subhash Goud
|

Updated on: Apr 30, 2021 | 10:06 PM

Share

Samsung Galaxy Book Flex 2 Alpha: స్మార్ట్‌ డివైజ్‌ల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న శామ్‌సంగ్ మరో కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ 2 ఆల్ఫా పేరుతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను సంస్థ అమెరికాలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ బుక్, గెలాక్సీ బుక్ ప్రో, గెలాక్సీ బుక్ ప్రో 360, గెలాక్సీ బుక్ ఒడిస్సే వంటి డివైజ్‌లను శామ్‌సంగ్ ఆవిష్కరించింది. కాగా, ఇప్పటికే ల్యాప్‌టాప్‌ ముందస్తుగా బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. గత ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చిన గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా డివైజ్‌కు కొనసాగింపుగా కొత్త ల్యాప్‌టాప్‌ను శామ్‌సంగ్ రూపొందించింది. గత మోడల్ మాదిరిగానే 2 ఇన్ 1 కన్వర్టబుల్ డిజైన్‌తో కొత్త ఆల్ఫా ల్యాప్‌టాప్‌ను తయారు చేశారు. గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ 2 ఆల్ఫా లెవన్త్ జనరేషన్‌ ఇంటెల్ Core i5, Core i7 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది.

అద్భుతమైన ఫీచర్లు

గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ 2 ఆల్ఫా ల్యాప్‌టాప్.. 2 ఇన్ 1 కన్వర్టబుల్ డిజైన్‌తో లభిస్తుంది. 13.3 అంగుళాల QLED ఫుల్ హెచ్‌డి (1,920×1,080 పిక్సెల్స్) టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో తయారు చేశారు. ఇది 400 నిట్స్ బ్రైట్‌నెస్, అవుట్‌ డోర్ మోడ్‌లో 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే డివైజ్‌లో 8GB LPDDR4x ర్యామ్, 256GB SSD స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే మరో వేరియంట్‌.. 16GB LPDDR4x ర్యామ్, 512GB SSD స్టోరేజీ ఆప్షన్‌తో లభిస్తోంది.

బ్యాక్‌లిట్ కీబోర్డ్, గ్లాస్ ట్రాక్‌ప్యాడ్, డాల్బీ అట్మోస్ ఆడియో, 720p వెబ్‌క్యామ్, డ్యుయల్ అర్రే మైక్రోఫోన్లు, రెండు 1.5W స్టీరియో స్పీకర్లతో ఫ్లెక్స్‌ 2 ఆల్ఫా ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, విండోస్ 10 హోమ్‌, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.1, 3.2 టైప్-ఎ పోర్ట్‌లు, ఒక యుఎస్‌బి టైప్-సి పోర్ట్, హెచ్‌డిఎంఐ పోర్ట్, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్.. వంటి ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను శామ్‌సంగ్ రూపొందించింది.

కాగా, గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ 2 ఆల్ఫా ల్యాప్‌టాప్‌ను ప్రస్తుతం అమెరికాలోనే విడుదల చేస్తున్నారు. శామ్‌సంగ్ యూఎస్ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే డివైజ్ ధర 849 డాలర్ల (సుమారు రూ. 63,000) నుంచి ప్రారంభమవుతుంది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న మరో వేరియంట్ ధర 1,049 డాలర్లుగా (సుమారు రూ. 77,700) ఉంది. అయితే భారత్‌లో దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై సమాచారం లేదు.

ఇవీ చదవండి:

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Samsung M42g: సామ్‌సంగ్‌ నుంచి ఎం42 5జీ మొబైల్‌ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!