AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LG Foldable Laptop: ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ స్టన్నింగ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు..

పెరిగిన వినియోగానికి అనుగుణంగా అన్ని కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ ల్యాప్‌టాప్‌లను రిలీజ్‌ చేస్తున్నారు. కొత్త రకాల ఫీచర్లతో ఆయా ల్యాప్‌టాప్‌లు వినియోగదారుల ఆదరణను పొందుతాయి. అయితే ఇటీవల కాలంలో హెచ్‌పీ, లెనోవో, ఆసస్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే అధునాతన ఫీచర్లు వస్తుండడంతో వినియోగదారులు కూడా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

LG Foldable Laptop: ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ స్టన్నింగ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు..
Lg Gram Fold
Nikhil
| Edited By: |

Updated on: Sep 28, 2023 | 4:46 PM

Share

భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరిగాక వినియోగం బాగా పెరిగింది. అలాగే పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులకు ఉపయోగకరంగా ఉండడంతో ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్‌ తప్పనిసరైంది. పెరిగిన వినియోగానికి అనుగుణంగా అన్ని కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ ల్యాప్‌టాప్‌లను రిలీజ్‌ చేస్తున్నారు. కొత్త రకాల ఫీచర్లతో ఆయా ల్యాప్‌టాప్‌లు వినియోగదారుల ఆదరణను పొందుతాయి. అయితే ఇటీవల కాలంలో హెచ్‌పీ, లెనోవో, ఆసస్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే అధునాతన ఫీచర్లు వస్తుండడంతో వినియోగదారులు కూడా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా ప్రముఖ బ్రాండ్‌ అయిన ఎల్‌జీ కూడా కొత్త ల్యాప్‌టాప్‌తో మన ముందుకు వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌లు ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కోరుకునే వినియోగదారులపై చాలా ప్రభావం చూపాయి. ఇప్పుడు ఎల్‌జీ తన సరికొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌తో రంగంలోకి దిగింది. ఈ తాజా ల్యాప్‌టాప్‌ 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్‌ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ కొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ గ్రామ్ ఫోల్డ్ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ అధికారికంగా అక్టోబర్ 2023లో దక్షిణ కొరియాలో విడుదల చేస్తారని నివేదికలు వెల్లడిస్తున్నారు. ల్యాప్‌టాప్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఫీచర్లు మాత్రం ఓ సారి తెలుసకుందాం.

ఎల్‌జీ గ్రామ్‌ఫోల్డ్‌ ఫీచర్లు ఇవే

ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ 2560 x 1920 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్‌ఈడీ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. టాబ్లెట్ మోడ్‌లో ల్యాప్‌టాప్ పరిమాణం 378 x 280 ఎంఎం, ఫోల్డ్ మోడ్‌లో 192 x 280 ఎంఎం డిస్‌ప్లేతో ఆకర్షణీయగా ఉంటుంది. గ్రామ్ ఫోల్డ్‌ బరువు దాదాపు 1,250 గ్రాములు (కీబోర్డ్ మినహా), 1,530 గ్రాములు కీబోర్డ్‌తో సహా బరువుతో వస్తుంది. దీని వల్ల వినియోగదారులు దానిని స్థలం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం సులభం అవుతుంది. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ ఇంటెల్‌ ఐ5 13వ జెన్‌ ప్రాసెసర్, అంతర్నిర్మిత డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్ కార్డ్‌పై పని చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో వస్తుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్‌ ద్వారా ఎల్‌జీ కంపెనీ టచ్‌ప్యాడ్‌తో కూడిన బ్లూటూత్ పూర్తి పరిమాణ కీబోర్డ్ అనుబంధాన్ని అభివృద్ధి చేసింది. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ విండోస్ 11 హోమ్ (64 బిట్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తో పని చేస్తుంది. యూఎస్‌బీ పోర్ట్‌ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్ యూఎస్‌బీ 4.0 జెన్‌ 3తో రెండు టైప్‌ సీ పోర్ట్‌లతో వస్తుంది. అయితే ఈ ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..