Lenovo Dual Screen Laptop: రెండు స్క్రీన్లు.. ఒకేసారి రెండు పనులు.. లెనోవో నుంచి మడతపెట్టే ల్యాప్ టాప్ మామూలుగా లేదుగా..
ఇది డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్, ఇందులో రెండు ఓఎల్ఈడీ డిస్ ప్లేలు ఉంటాయి. దీనిని ఎంచక్కా ఫోల్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11పై నడుస్తుంది.

ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో నుంచి కొత్త ల్యాప్ టాప్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దీనిలో పేరు లెనోవో యోగా బుక్ 9ఐ. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ స్క్రీన్. దీనిలో 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ డిస్ ప్లే 2.8కే రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఇంటెల్ ఈవో ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది వైఫై 6ఈ, థండర్‌బోల్ట్ 4తో సహా తాజా కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. ఫోలియో స్టాండ్, వేరు చేయగల బ్లూటూత్ కీబోర్డ్ వంటి విభిన్న ఉపకరణాలతో వస్తుంది. యోగా బుక్ 9ఐ నాలుగు-సెల్స్ కలిగిన 80Whr బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
లెనోవో యోగా బుక్ 9ఐ ధర, లభ్యత..
మన దేశంలో ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ. 2,24,999గా ఉంది. ల్యాప్‌టాప్ టైడల్ టీల్ షేడ్‌లో వస్తుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ లను ఆహ్వానిస్తోంది. పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోలు చేస్తే రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ను లెనోవో అందిస్తోంది. పాత ల్యాప్ టాప్ లను ఎక్స్ చేంజ్ చేయడం ద్వారా మరో రూ. 10,000 బోనస్ ను పొందొచ్చు. వాస్తవానికి ఈ ల్యాప్ టాప్ సీఈఎస్ 2023లోనే ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. అప్పుడు దీని ధర 2,099.99 డాలర్లు. అంటే అది మన కరెన్సీలో రూ. 1,75,000గా ఉంటుంది.
లెనోవో యోగా బుక్ 9ఐ స్పెసిఫికేషన్స్..
ఇది డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్, ఇందులో రెండు ఓఎల్ఈడీ డిస్ ప్లేలు ఉంటాయి. దీనిని ఎంచక్కా ఫోల్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11పై నడుస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీఆర్ సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో రెండు 13.3-అంగుళాల 2.8కే ఓఎల్ఈడీ ప్యూర్‌సైట్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్ మోడ్‌లో కూడా వినియోగించుకోవచ్చు. అందుకోసం దీనికి ఫోలియో స్టాండ్ ఉంచారు.




- లెనోవో యోగా బుక్ 9ఐ, ఇంటెల్ ఈవో ప్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంది. 13వ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో రన్ అవుతుంది. ఇది 16జీబీ ర్యామ్ ని కలిగి ఉంటుంది. 1టీబీ వరకూ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో రెండు 2వాట్ల సామర్థ్యంతో స్పీకర్లు, మరో రెండు 1వాట్ బోవర్‌లు డాల్బీ అట్మోస్ ఆడియోతో విల్కిన్స్ స్పీకర్‌లు ఉన్నాయి.
- దీనిలో ఫుల్ హెచ్ డీ ఐఆర్ ఆర్జీబీ వెబ్ కామ్ ఉంచారు. ఫోలియో స్టాండ్‌తో పాటు, లెనోవో వేరు చేయగలిగిన బ్లూటూత్ కీబోర్డ్ , యోగా బుక్ 9iతో కూడిన స్టైలస్‌తో సహా బండిల్ యాక్సెసరీలను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ థండర్ బోల్ట్ 4తో మూడు యూఎస్బీ టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంది. బ్లూటూత్ 5.2 , వైఫఐ 6ఈ కనెక్టివిటీ అందిస్తుంది.
- ఈ ల్యాప్ టాప్ నాలుగు-సెల్ 80వాట్ ఆవర్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీని కలిగి ఉంది, ఇది ఒక ఛార్జ్‌పై డ్యూయల్ స్క్రీన్ వినియోగంతో గరిష్టంగా 10 గంటలు పనిచేస్తుంది. ఒకే డిస్‌ప్లేను ఉపయోగిస్తున్నప్పుడు ఇది గరిష్టంగా 14 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




