Flipkart Big Billion Days: ఆ కార్డుల ద్వారానే పది శాతం తగ్గింపు… ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఆఫర్ల వివరాలివే..
ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్లను ఇస్తూ ప్రతి ఏడాది బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంది. ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడమే కాకుండా బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అయితే ప్రతి ఏడాది ఏ బ్యాంకుల కార్డుల ద్వారా ఆఫర్లు వస్తాయో? వినియోగదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్-2023 ఏ బ్యాంకు కార్డులపై ఆఫర్లు వస్తాయో? తాజాగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
వినాయక చవితి పర్వదినంతో భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. పండుగ రోజు ఏదైనా కొత్త వస్తువు కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సూపర్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. వినియోగదారుల తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్ ఆర్డర్స్ ద్వారా తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వినియోగం భారతదేశంలో బాగా పెరిగింది. పండుగ సీజన్ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్లను ఇస్తూ ప్రతి ఏడాది బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంది. ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడమే కాకుండా బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అయితే ప్రతి ఏడాది ఏ బ్యాంకుల కార్డుల ద్వారా ఆఫర్లు వస్తాయో? వినియోగదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్-2023 ఏ బ్యాంకు కార్డులపై ఆఫర్లు వస్తాయో? తాజాగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై తక్షణ తగ్గింపులు, ఆఫర్‌లను అందించాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. అంతేకాకుండా సేల్ సమయంలో కస్టమర్‌లు పేటీఎం, యూపీఐ, ఇతర వాలెట్ లావాదేవీల ద్వారా కూడా ఆఫర్‌లను అందుకుంటారు
బ్యాంక్ ఆఫర్లు ఇలా
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అధికారిక పేజీ ప్రకారం ఈ-కామర్స్ సైట్ కస్టమర్‌లు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎంచుకున్న డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందే అవకాశాన్ని అందిస్తుంది. అంతే కాకుండా, పేటీఎం, యూపీఐ, ఇతర వాలెట్ల ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్‌లు కూడా సేల్ సమయంలో నిశ్చయమైన పొదుపులను అందుకుంటారు. వీటితో పాటు కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఫీచర్, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు వంటి ఇతర ఎంపికలను కూడా ఉపయోగించగలరు.
మొబైల్స్‌పై ఆఫర్లు ఇలా
ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రధాన ఆఫర్‌ల వివరాలను వెల్లడించనప్పటికీ ఐఫోన్‌లతో సహా స్మార్ట్‌ఫోన్‌లపై పెద్ద స్థాయి తగ్గింపులను ఆశించవచ్చు. ఐఫోన్ డీల్స్ అక్టోబర్ 1న వెల్లడికానుండగా సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ల డీల్స్ అక్టోబర్ 7న విడుదల కానున్నాయి. అయితే కస్టమర్‌లు అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై రాబోయే తగ్గింపుల గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, రియల్ మీ, ఒప్పో, ఎంఐ నథింగ్, వివో వంటి ప్రముఖ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లు అందిస్తారు. వినియోగదారులు ఆయా స్మార్ట్‌ఫోన్‌లపై 80 శాతం వరకు తగ్గింపును ఆశించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..