AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Billion Days: త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రియులు ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పుడు దసరా సమీపిస్తున్న సమయంలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే తాజాగా దసరా సమీపిస్తున్నందున ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌కు సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఇది కేవలం టీజర్ పేజీ మాత్రమే. సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Flipkart Big Billion Days: త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
Online Shopping
Nikhil
|

Updated on: Sep 22, 2023 | 4:30 PM

Share

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు నూతన ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఎన్ని రకాల ఆఫర్లు పెట్టిన ఫ్లిప్‌కార్ట్‌ దసరా సమయంలో ఇచ్చే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌ ఆఫర్లకు సాటిరావు. అందుకే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రియులు ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పుడు దసరా సమీపిస్తున్న సమయంలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే తాజాగా దసరా సమీపిస్తున్నందున ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌కు సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఇది కేవలం టీజర్ పేజీ మాత్రమే. సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సేల్‌లో ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు లభిస్తాయో? ఓసారి చెక్‌ చేద్దాం.

ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు అతితక్కువ ధరకు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 21 ఎఫ్‌ఈ 5జీతో పాటు ఐ ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తాయి. అయితే ఆఫర్లు లభించే ఐఫోన్‌ మోడల్స్‌ పేర్కొననప్పటికీ ఈ వివరాలు అక్టోబర్ 1న వెల్లడిస్తామని ఫ్లిఫ్‌కార్ట్‌ ధ్రువీకరించింది. అలాగే సామ్‌సంగ్‌, రియల్‌ మీ ఫోన్ డీల్‌లు వరుసగా అక్టోబర్ 3, అక్టోబర్ 6న లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తారు. అదేవిధంగా రెడ్‌మీ ఫోన్ అభిమానులు అక్టోబర్ 7 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఒప్పో, పోకో ఫోన్ల ఆఫర్లను ఒప్పందాలు అక్టోబర్ 8న జాబితా చేస్తారు.

ల్యాప్‌టాప్‌లపై కూడా తగ్గింపులు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 50 నుంచి 80 శాతం తగ్గింపును అందిస్తామని హామీ ఇచ్చింది. జాబితా ప్రకారం ఇయర్‌ఫోన్‌ల ధర రూ. 499, కీబోర్డ్‌ల ధర రూ. 99 నుంచి ప్రారంభమవుతాయి. వైడ్ స్క్రీన్ మానిటర్లపై 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రింటర్లపై 60 శాతం తగ్గింపు లభిస్తుంది. టీవీలతో ఇతర గృహోపకరణాలను కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ 80 శాతం వరకు తగ్గింపును అందజేస్తుంది. ముఖ్యంగా జనాదరణ పొందిన 4కే స్మార్ట్ టీవీలు 75 శాతం వరకు తగ్గింపు ధరతో లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఐఫోన్లపై తగ్గింపులు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రష్ అవర్స్ డీల్‌లు, బంపర్ వాల్యూ అవర్స్, సూపర్ వాల్యూ కాంబోస్ మరిన్ని ఆఫర్లు లభిస్తాయి. అయితే ఈ సేల్‌లో ఐఫోన్ 13,. ఐఫోన్ 14 కొన్ని తగ్గింపులను పొందవచ్చని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యాపిల్‌ కంపెనీ ప్రతి సంవత్సరం పాత ఐఫోన్‌లపై మంచి తగ్గింపు ఆఫర్‌లను అందిస్తుంది. కాబట్టి ఈ సేల్‌లో ఐఫోన్లను ఎన్నడూ లేనంత తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..