Microsoft Surface Event 2023: మైక్రోసాఫ్ట్ ‘ఏఐ సహచరుడు‘ వచ్చేశాడు.. కొత్త లాంచింగ్స్ అదిరిపోయాయిగా..

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే సర్ఫేస్ ఈవెంట్ 2023 ముగిసింది. ఈ ఏడాది కూడా పలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసింది. దీనిలో అందరూ ఊహించిన విధంగానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై అధికంగా ఫోకస్ పెట్టింది. అందులో మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఒకటి. దీనిని ఆ కంపెనీ వినియోగదారుల సహచరుడు ఏఐ(ఏఐ కంపానియన్ ఫర్ యూజర్స్) అని పిలుస్తోంది..

Microsoft Surface Event 2023: మైక్రోసాఫ్ట్ ‘ఏఐ సహచరుడు‘ వచ్చేశాడు.. కొత్త లాంచింగ్స్ అదిరిపోయాయిగా..
Microsoft
Follow us
Madhu

|

Updated on: Sep 22, 2023 | 2:15 PM

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే సర్ఫేస్ ఈవెంట్ 2023 ముగిసింది. ఈ ఏడాది కూడా పలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసింది. దీనిలో అందరూ ఊహించిన విధంగానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై అధికంగా ఫోకస్ పెట్టింది. అందులో మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఒకటి. దీనిని ఆ కంపెనీ వినియోగదారుల సహచరుడు ఏఐ(ఏఐ కంపానియన్ ఫర్ యూజర్స్) అని పిలుస్తోంది. ఇది విండోస్ కలిగిన పీసీల పనితీరు మెరుగవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. విండోస్ 11 ఓఎస్, మైక్రోసాఫ్ట్ 365, ఎడ్జ్ బ్రౌజర్, బింగ్ సెర్చ్ ఇంజిన్ లకు ఈ ఏఐ కాంపానియన్ సపోర్టు చేసేలా తీసుకొచ్చినట్లు ఈవెంట్ సందర్భంగా ప్రకటించింది. దీంతో పాటు సర్ఫేస్ ఈవెంట్ ప్రకటించిన టాప్ అంశాల గురించి ఇప్పుడు చూద్దాం..

ఏఐ కోపైలెట్.. ఈ కొత్త ఏఐ సహచరుడు సెప్టెంబర్ 26 నుంచి విండోస్ 11 వినియోగదారులకు ఓ అప్ డేట్ రూపంలో అందుబాటులో రానుందని మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్ ఈవెంట్లో ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు టాస్క్ లను ఆటోమేషన్ ద్వారా వేగంగా చేయడానికి వీలుంటుంది. పెయింట్స్, ఫొటోస్ లను ఎడిటింగ్ చేసుకునేందుకు ఈ ఏఐ టూల్ ఉపకరిస్తుంది. మైక్రోసాఫ్ట్ కోపైలెట్ అనేది వినియోగదారులకు మంచి పనితీరుని అందించేందుకు కంపెనీ చేస్తున్న మంచి ప్రయత్నమని ఆ కంపెనీ ప్రకటించుకుంది. దీని సాయంతో స్నిప్పింగ్ టూల్, నోట్ ప్యాడ్, క్లిప్ చాంప్, ఫైల్ ఎక్స్ ప్లోరర్, న్యూ అవుట్ లుక్ యాప్ వంటి ఫీచర్లు వినియోగదారులకు త్వరలో ఏఐ లుక్ లో అందుబాటులోకి రానున్నాయి.

బింగ్ ఇమజ్ క్రియేటర్ లో డీఏఎల్ఎల్-ఈ.. మైక్రోసాఫ్ట్ తన బ్లాక్ పోస్ట్ లో ప్రకటించిన విధంగా ఇప్పుడు ఏఐ ఇమేజ్ క్రియేటర్ ఓపెన్ ఏఐకు చెందిన డీఏఎల్ఎల్-ఈ 3తో వస్తుంది. అలాగే మరిన్ని సులభమైన ఎడిటింగ్ ఆప్షన్ల కోసం మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఇంటిగ్రేషన్ తో అనుసంధానమవుతోంది. అదే విధంగా చాట్ హిస్టరీ, బింగ్, ఎడ్జ్ లలో కోపైలెట్ ద్వారా ఏఐ ఆధారిత షాపింగ్ కు ఇది అనుకూలిస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మైక్రోసాఫ్ట్ 365 కోపైలెట్.. నవంబర్ ఒకటో తేదీ నుంచి మైక్రోసాఫ్ట్ 365 కోపైలెట్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని టెక్ జెయింట్ ప్రకటించింది. దీనిలో కొత్త మైక్రోసాఫ్ట్ 365 చాట్ ఫీచర్ భారీగా ఉన్న డేటా ఫైళ్లను స్కాన్ చేసి.. వాటి నుంచి కఠినమైన ప్రశ్నలకు కూడా సులభంగా సమాధానం ఇస్తుంది. ఇది ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్లో కూడా చేసేలా దీనిని తయారు చేశారు. అలాగే డిజైనర్ టూల్ కూడా సోషల్ మీడియా గ్రాఫిక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

సర్ఫేస్ ల్యాప్ టాప్ స్టూడియో 2.. మైక్రోసాఫ్ట్ చెబుతున్న దాని ప్రకారం ఈ కొత్త సర్ఫేస్ అనేది ఇంటెల్ సీపీయూ, ఎన్వీఐడీఐఏ స్టూడియో టూల్స్ తో వస్తుంది. ఇది మ్యాక్ బుక్ ప్రో ఎం2 మ్యాక్స్ తో పోల్చితే డబుల్ గ్రాఫిక్స్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. 14.4 అంగుళాల టచ్ డిస్ ప్లే, హ్యాప్టిక్ ఎనేబుల్డ్ టచ్ ప్యాడ్ ఉంటుంది.

సర్ఫేస్ ల్యాప్ టాప్ గో 3.. ఈ ల్యాప్ టాప్ లో 12.4 అంగుళాల టచ్ డిస్ ప్లే ఉంటుది. ఇంటెల్ కోర్ ఐ5-1235యూ సీపీయూ, 16జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 11 హోమ్, 40వాట్ అవర్ బ్యాటరీతో పాటు వింగర్ ప్రింట్ సెన్సార్ మౌంటెండ్ పవర్ బటన్ ఉంటుంది. దీని ధర రూ. 799డాలర్లుగా ఉంది. ఇది అక్టోబర్ 3 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. అదే రోజు నుంచి మన భారతదేశంలోకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

  • అదే విధంగా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 4 టూ ఇన్ వన్ మెషీన్ ని ప్రకటించింది. ఇది 10.5 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ ఎన్200 సీపీయూ, 8జీబీ ర్యామ్, 256జీబీ మెమరీ ఉంటుంది. దీని ధర రూ. 579డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే సర్ఫేస్ హబ్ 3 ని కూడా 50అంగుళాలు, 80 అంగుళాల స్క్రీన్లలో లాంచ్ చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..