Apple iPhone 14 Pro: యాపిల్ ఐఫోన్‌పై ఏకంగా రూ. 49,000 తగ్గింపు.. త్వరపడండి.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
యాపిల్ ఐఫోన్ చాలా మందికి డ్రీమ్ ఫోన్. అయితే సామాన్యులకు అందని ద్రాక్ష. ఎందుకంటే దాని ధర చాలా ఎక్కువ. అయితే మీ కల నెరవేర్చుకునే సువర్ణావకాశం ఇప్పుడు దొరకింది. ఇకపై ధర గురించి ఆలోచించాల్సి అవసరం లేదు. యాపిల్ ఐఫోన్14 ప్రో మోడల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 49,000 తగ్గింపుపై దీనిని కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాపిల్ ఐఫోన్ చాలా మందికి డ్రీమ్ ఫోన్. అయితే సామాన్యులకు అందని ద్రాక్ష. ఎందుకంటే దాని ధర చాలా ఎక్కువ. అయితే మీ కల నెరవేర్చుకునే సువర్ణావకాశం ఇప్పుడు దొరకింది. ఇకపై ధర గురించి ఆలోచించాల్సి అవసరం లేదు. యాపిల్ ఐఫోన్14 ప్రో మోడల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 49,000 తగ్గింపుపై దీనిని కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 12న యాపిల్ నుంచి సరికొత్త మోడల్ ఐఫోన్ లాంచ్ అయ్యింది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో పేరిట ఈ కొత్త ఫోన్ వచ్చింది. దీంతో పాత మోడల్ ఐఫోన్ 14 ప్రో ను యాపిల్ స్టోర్ నుంచి తొలిగించింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అమ్మకానికి పెట్టింది. పైగా భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 14 ప్రో గతేడాది లాంచింగ్ అప్పుడు ధర రూ. 1,29,999గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్ పై ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ రూ. 9,901 తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ. 1,19,999గా ఉంది. కాగా మీ పాత ఫోన్ మీరు ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 36,100 వరకూ మీరు తగ్గింపును పొందుతారు. దీంతో మీకు యాపిల్ ఐఫోన్ 14 ప్రో మీకు కేవలం రూ. 83,899కే లభిస్తోంది. ఇది కాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు ఈఎంఐ లావాదేవీలపై రూ. 3000 వరకూ అదనపు తగ్గిపును పొందుతారు. అప్పుడు మీకు ఈ ఫోన్ కేవలం రూ. 80,899కే లభిస్తుంది. అంటే మొత్తం మీద మీకు ఈ యాపిల్ ఐఫోన్ 14 ప్రో పై రూ. 49,001 తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్లు ఇవే..
ఆపిల్ ఐఫోన్ 14 ప్రో అనేది యాపిల్ నుంచి వచ్చిన మొదటి నాచ్‌లెస్’ ఫోన్. కొత్త డైనమిక్ ఐలాండ్‌కు ధన్యవాదాలు. దీనిలో ఏ16 బయోనిక్ చిప్ ఉంటుంది. 48ఎంపీ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో 12ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. చిప్, డైనమిక్ ఐలాండ్, 48ఎంపీ కెమెరా, యాపిల్ ఐఫోన్ 15 స్టాండర్డ్ మోడల్‌లలో కూడా కొనసాగుతాయి. యాపిల్ 14 ప్రో అనేది డైనమిక్ ఐలాండ్ మరియు 48ఎంపీ కెమెరాతో ప్రారంభించబడిన మొట్టమొదటి ఆపిల్ ఫోన్. ఈ ఫోన్ లాంచింగ్ అప్పటి నుంచి మంచి సేల్స్ రాబట్టింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్స్ జరిగాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..