Fire-Boltt Smartwatch: శామ్సంగ్‌ను దాటేసిన ఫైర్ బోల్ట్.. కొత్త స్మార్ట్‌వాచ్‌తో సెన్సేషన్.. టాప్ క్లాస్ ఫీచర్లు
ఫైర్ బోల్ట్ మరో కొత్త స్మార్ట్ వాచ్ ను మన దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని ఆవిష్కరించింది. స్టీల్ బాడీ తోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో ఉంది. స్టైలిష్ డిజైన్ తో పాటు స్టన్నింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, హెల్త్ ఫీచర్లు, ధర, లభ్యత గురించి ఇప్పడు తెలుసుకుందాం..
తక్కువ ధరలో మంచి ఫీచర్లు, స్మార్ట్ లుక్ ను అందించే స్మార్ట్ వాచ్ లలో ఫైర్ బోల్ట్ ఒకటి. ఇటీవల కాలంలో పలు స్మార్ట్ వాచ్ లు తమ సత్తా చాటాయి. దీంతో గ్లోబల్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో ఫైర్ బోల్ట్ టాప్ లేపింది. ఇప్పటి వరకూ యాపిల్ తర్వాత సెకండ్ టాప్ పొజిషన్ లో ఉన్న శామ్సంగ్ ను బీట్ చేసింది . ఫైర్ బోల్ట్ ఏకంగా 57శాతం వృద్ధి రేటును సాధించి, శామ్సంగ్ ను అధిగమించింది. ఈ ఉత్సాహంలో ఫైర్ బోల్ట్ మరో కొత్త స్మార్ట్ వాచ్ ను మన దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని ఆవిష్కరించింది. స్టీల్ బాడీ తోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో ఉంది. స్టైలిష్ డిజైన్ తో పాటు స్టన్నింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, హెల్త్ ఫీచర్లు, ధర, లభ్యత గురించి ఇప్పడు తెలుసుకుందాం..
ఫైర్ బోల్ట్ సోలేస్ ధర, లభ్యత..
దేశీయ బ్రాండ్ అయిన ఫైర్ బోల్ట్ నుంచి వచ్చిన ఈ కొత్త స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, గోల్డ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1,999కే లభిస్తోంది. ఫైర్ బోల్ట్ ఈ-స్టోర్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో ఇది లభ్యమవుతోంది. ఈ ధర సెప్టెంబర్ 12 నుంచి రెండు రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఫైర్ బోల్ట్ సోలేస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ కొత్త ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లో 1.32 అంగుళాల డిస్ ప్లే హెచ్ డీ రిజల్యూషన్ తో ఉంటుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వాచ్ ఫేసెస్ ను మార్చుకునేందుకు వీలుగా మల్టీపుల్ ఆప్షన్లను ఉంటాయి. ఈ వాచ్ రోటేటింగ్ క్రౌన్ ఉంటుంది. రెండు పుష్ బటన్స్ ఉంటాయి.
ఈ కొత్త స్మార్ట్ వాచ్ స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో ప్రీమియం ఫినిష్ తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. అందుకోసం డయల్ ప్యాడ్ ఉంటుంది. కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్ ను ఫోన్ నుంచి సింక్రనైజ్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్, స్పీకర్లు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కు సహకరిస్తాయి.
ఈ స్మార్ట్ వాచ్ లో పలు హెల్త్ ట్రాకర్లు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తుంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్లు, డ్రింకింగ్ వాటర్, ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి సెడెంటరీ రిమైండర్లు ఉంటాయి. అంతేకాక స్మార్ట్ రిమైండర్స్, వెదర్ అప్ డేట్లు, కాలిక్యూలేటర్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, అలారం, టైమర్, స్టాప్ వాచ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
దాదాపు 120 స్పోర్ట్స్ మోడ్లు దీనిలో ఉంటాయి. యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్టు ఇస్తుంది. ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ లో 230ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్టాంబ్ బైలో అయితే 15 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..