Flipkart: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్‌ పండగ వచ్చేస్తోంది.. ఊహకందని ఆఫర్స్‌

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఎర్లీ యాక్సెస్‌ అందించనున్నారు. యాపిల్‌, ఐకూ, వన్‌ప్లస్, సామ్‌సంగ్‌, షావోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. వీటితోపాటు పలు బ్రాండ్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌...

Flipkart: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్‌ పండగ వచ్చేస్తోంది.. ఊహకందని ఆఫర్స్‌
Flipkart Big Billion Days 2
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2023 | 3:34 PM

Flipkart Big billion days 2023: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023ని నిర్వహించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ సేల్‌ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ సేల్‌లో ఉండనున్న డిస్కౌంట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ కొన్ని రోజుల నుంచి చిన్ని చిన్న హింట్స్‌ను ఇస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఎర్లీ యాక్సెస్‌ అందించనున్నారు. యాపిల్‌, ఐకూ, వన్‌ప్లస్, సామ్‌సంగ్‌, షావోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. వీటితోపాటు పలు బ్రాండ్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌లు, నోకాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్స్‌ పొందే అవకాశం ఉంది.

ఇక ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొత్త ప్రొడక్ట్స్‌ లాంచ్‌ చేయనున్నారు. మోటోరోలా, వివో, సామ్‌సంగ్‌ బ్రాండ్స్‌ కొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఈ సేల్‌లో మోటోరోలో ఎడ్జ్‌ 40 నియో, వివో టీ2 ప్రో, సామ్‌సంత్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 2023 ఎడిషన్స్‌ లాంచ్‌ కానున్నాయి. వీటితోపాటు మోటీజీ54, గ్యాలక్సీ ఎఫ్‌34, రియల్‌మీ సీ 51, రియల్‌మీ 115జీతో పాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ సభ్యులకు ఒకటి, రెండు రోజుల ముందే సేల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అదనంగా క్యాష్‌బ్యాక్‌తో పాటు మరిన్ని డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఇక వీటితో పాటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులపై కొనుగోలు చేసిన వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!