Mask with Mic: ఈ మాస్క్ చాలా స్పెషల్.. తన తల్లిదండ్రుల కోసం ప్లాన్ చేశాడు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది..

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మాస్క్ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో మాస్క్ ధరించి మరొకరితో మాట్లాడటం చాలా కష్టంగా మారింది. తన మెదడు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.

Mask with Mic: ఈ మాస్క్ చాలా స్పెషల్.. తన తల్లిదండ్రుల కోసం ప్లాన్ చేశాడు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది..
Mask With Mic
Follow us
Sanjay Kasula

|

Updated on: May 24, 2021 | 2:30 PM

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మాస్క్ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో మాస్క్ ధరించి మరొకరితో మాట్లాడటం చాలా కష్టంగా మారింది. తన మెదడు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో కోవడ్‌ను నుంచి రక్షణ పొందేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. కొందరు డిస్టెన్స్ పాటించేందుకు కొత్త తరహాలో ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని ప్రజల్లోకి వెళ్లిపోయాయి. .

మరోవైపు కేరళలోని త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కెవిన్ జాకబ్ మైక్, స్పీకర్ ఉన్న మాస్కును తయారు చేశాడు.

కెవిన్ జాకబ్ తల్లిదండ్రులు ఇద్దరూ కేరళలోని త్రిస్సూర్‌లో ప్రముఖ వైద్యులు. కెరోన్ తల్లిదండ్రులు కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగులతో కమ్యూనికేట్ చేయడానికి వారు చాలా కష్టపడుతున్నారు. సంభాషణలను ఈజీ చేయడానికి మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు.

అతను తన తల్లిదండ్రులు డాక్టర్ సెనోస్ కాసే, డాక్టర్ జ్యోతి మేరీ జోస్‌తో కలిసి మొదటి నమూనాను పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తెలిసినవారి నుంచి కావాలాంటూ డిమాండ్ పెరిగింది. అతను మరిన్నింటిని తయారు చేయడం మొదలు పెట్టాడు.

అయితే ఈ స్పీకర్‌ మాస్క్‌ ద్వారా వైద్యులు.. కరోనా బాధితుల‌తో సుల‌భంగా మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. దీనిని 30 నిమిషాలు చార్జ్‌ చేస్తే ఆరు గంటలపాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చని కెవిన్‌ తెలిపాడు. డాక్టర్లైన తన తల్లిదండ్రులు, పేషెంట్లో కమ్యూనికేట్‌ చేయడానికి పడే కష్టాలను చూసి ఈ మాస్క్‌ తయారు చేయాలన్న ఆలోచన కలిగినట్లు పేర్కొన్నాడు. ఇది అయస్కాంతం ద్వారా మాస్క్‌కు అంటించడ జరుగుతుంది.

కెవిన్ ఇప్పుడు దానిని భారీ స్థాయి ఉత్పత్తికి తీసుకెళ్లగల సంస్థల కోసం చూస్తున్నాడు.ఇలాంటి స్పీకర్ మాస్కులను 50 కి పైగా తయారు చేశాడు. వీటిని దక్షిణ భారతదేశంలోని వైద్యులు చాలామంది ఉపయోగిస్తున్నారు. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి తన వద్ద ఇంకా డబ్బు లేదని… అయితే ఎవరైన స్పాన్సర్లు దొరికితే మరిన్ని స్పీకర్ మాస్కులను తయారు చేస్తానంటున్నాడు. తన ఈ చిన్న ప్రాజెక్టు చాలా మంది ప్రజలు సహాయం చేస్తుందని నమ్ముతున్నాడు.

ఇవి కూడా చదవండి: Coronavirus: కుక్కలు మనిషి చెమట వాసనను ద్వారా కరోనాను గుర్తిస్తాయి: తాజా పరిశోధనలో లండన్‌ శాస్త్రవేత్తలు

Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?