Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Marriage in charter flight: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అన్ని చోట్ల లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుభకార్యాలకు

Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Marriage In Plane
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2021 | 11:09 AM

Marriage in charter flight: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అన్ని చోట్ల లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుభకార్యాలకు సైతం కోవిడ్ నిబంధనలు పాటించాలని కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయన్న కారణంతో మధురైకి చెందిన రాకేష్, దక్షిణ విమానంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలందరి ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు. విమానంలోనే అంగరంగ వైభవంగా జరిగిన వివాహ తంతుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మేరకు వరుడు, వధువు కుటుంబసభ్యులు ఆదివారం మదురై నుంచి తూత్తుకుడికి రెండు గంటలపాటు విమానంలో ప్రయాణించారు. ఈ వివాహ తంతులో సుమారు 160 మంది పాల్గొన్నారు. మీనాక్షి ఆలయం మీదుగా విమానం.. ఎగురుతున్నప్పుడు వరుడు.. వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ఇరు కుటుంబాలు విమానంలోనే వివాహతంతు కానిచ్చేశాయి. కాగా.. ఈ పెళ్లిలో ఎవరూ మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరోనాకు ముందు జరిగిన వివాహం లాగానే పెళ్లి తంతు జరిగిందంటూ.. విమానంలో పెళ్లిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

దీంతో ఈ పెళ్లిపై సమగ్ర నివేదిక అందించాలని ఎయిర్‌లైన్స్ అథారిటీ సూచించింది. అయితే.. కేవలం ప్రయాణానికి.. మాత్రమే అనుమతి ఉందని విమానాశ్రయం డైరెక్టర్ సెంథిల్ వలవన్ చెప్పారు. అయితే విమానంలో వివాహం చేసుకోవడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. ఇది కరోనా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ వివాహానికి సంబంధించి విమానాశ్రయ అథారిటీ కూడా విమాన సర్వీసు సంస్థ నుంచి స్పందన కోరింది. దీంతోపాటు ఈ విషయంపై మధురై కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించారు. నివేదిక అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Also Read:

వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం….ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్, థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ వివరణపై స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వివాదాన్ని ముగిద్దామంటూ ట్వీట్

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?