International Brother’s Day 2021: ఈరోజు అంతర్జాతీయ సోదర దినోత్సవం.. బ్రదర్స్ డే ప్రాముఖ్యత ఏంటో తెలుసా..
International Brother's Day 2021: ప్రతి సంవత్సరం మే 24న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు అంతర్జాతీయ బ్రదర్స్ డే జరుపుకుంటారు.
International Brother’s Day 2021: ప్రతి సంవత్సరం మే 24న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు అంతర్జాతీయ బ్రదర్స్ డే జరుపుకుంటారు. మదర్స్ డే, ఫాదర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం బ్రదర్స్ డేను కూడా ఎక్కువ చోట్ల జరుపుకుంటారు. అయితే ఈ బ్రదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు. అసలు ఎప్పుడూ ప్రారంభమైందో తెలుసుకుందామా.
చరిత్ర.. 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. అలబామాకు చెందిన సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత సి డేనియల్ రోడ్స్ మొదటగా ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న జరుపుకునే నేషనల్ సిబ్లింగ్స్ డే దినోత్సవం మాదిరిగానే ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. అయితే మొదట్లో దీనిని కేవలం అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు.. తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈరోజును జరుపుకోవడం ప్రారంభించాయి. కొన్ని దేశాలలో ఈరోజున అధికారిక సెలవు దినంగా పాటిస్తారు.
ప్రాముఖ్యత.. కేవలం రక్త సంబంధం కాకపోయిన.. ఆత్మీయంగా సోదర భావంతో జరుపుకునే ప్రత్యేకమైన రోజు ఇది. మెరికన్ సిట్కామ్ బ్రదర్స్ , డిస్నీ ది సూట్ లైఫ్ ఆఫ్ జాక్ & కోడి , HBO యొక్క బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ వంటి చలనచిత్రాలు, నవలలు, నాటకాలు, టెలివిజన్ కార్యక్రమాలను ఈరోజున నిర్వహిస్తారు. ఈరోజున తమ ప్రియమైన సోదరులకు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ఆత్మీయ సోదరులకు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. తమ వారికి నచ్చిన వంటకాలను చేయడం.. వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా ఇవ్వడం చేస్తుంటారు..
కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్చల్..