AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Jobs: ఇవి ఐటీ జాబ్సే అయినా.. వీటిని ఏఐ రీప్లేస్ చేయలేదు!

ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. ఈ జనరేషన్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాలా ఉద్యోగాలను రిప్లేస్ చేస్తుందని రకరకాల భయాలు మొదలయ్యాయి. అయితే ఇందులో నిజం ఉన్నప్పటికీ ఏఐతో రీప్లేస్ చేయలేని టెక్ జాబ్స్ కూడా చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

AI Jobs: ఇవి ఐటీ జాబ్సే అయినా.. వీటిని ఏఐ రీప్లేస్ చేయలేదు!
Ai Jobs
Nikhil
|

Updated on: Sep 22, 2025 | 5:22 PM

Share

ఐటీ రంగంలో ఆటోమేషన్‌కు ఆస్కారం  ఉన్న చాలా రకాల ఉద్యోగాలను ఏఐ రిప్లేస్ చేయగలదు. అయితే క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్ తో ముడి పడిన కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఏఐతో ఎలాంటి ముప్పు లేదు. అందులో కొన్ని ఇవీ..

డెవలపర్స్

సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ను ఏఐ రీప్లేస్ చేస్తుందనుకుంటారు చాలామంది. కానీ, అందులో నిజం లేదు. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు రావాలంటే వాటిని కోడ్ రూపంలో డిజైన్ చేయగల నైపుణ్యం ఉండాలి. మానవ ప్రమేయం లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్లు తయారుచేయడం కుదరని పని. కాబట్టి కోడింగ్, డీబగ్గింగ్, టెస్టింగ్ వంటి ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్ల అవసరం ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటుంది.

డేటా సైంటిస్ట్

సాఫ్ట్ వేర్ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త డేటా పుడుతూ ఉంటుంది. దీన్ని సరైన రీతిలో ప్రాసెస్ చేయాలంటే తగిన మేధస్సు అవసరం. కాబట్టి డేటా సైన్స్ రంగంలో ఉన్నవాళ్లకు ఏఐతో ముప్పు లేకపోవడమే కాదు, ఏఐని మరింత డెవలప్ చేయాలంటే దానికి డేటా సైంటిస్టులే అవసరం అవుతారు.

సైబర్ సెక్యూరిటీస్

సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఎప్పటికీ మనుషులే మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో విలువైన సమాచారాలను తీసుకెళ్లి ఏఐ చేతులో పెట్టలేం. కొత్తగా వచ్చే సెక్యూరిటీ రిస్క్‌లను తెలుసుకోవడం, కొత్త స్ట్రాటెజీలు డెవలప్ చేయడం ఐటీ రంగానికి ఎంతో అవసరం. కాబట్టి సైబర్ సెక్యూరిటీ రంగానికి ఏఐతో ఎలాంటి ముప్పు ఉండే అవకాశం లేదు.

డిజైనర్

యూజర్లను ఆకర్షించేలా వెబ్ పేజీలను డిజైన్ చేయడం ఏఐకి చాలా ఈజీ టాస్క్. అయితే మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్, కస్టమైజేషన్ కోసం మనిషి మేధస్సు కూడా అవసరమవుతుంది. యూజర్‌ శాటిస్‌ఫాక్షన్ కోసం డిజైనర్ తనదైన సొంత క్రియేటివిటీని వాడాల్సి ఉంటుంది. కాబట్టి క్రియేటివ్ రంగాన్ని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు.

ప్రాజెక్ట్ మేనేజర్

ఒక పనిని విభజించి టీం మెంబర్స్‌కు అసైన్ చేయడం, వర్క్‌ను ట్రాక్ చేయడం, టీంతో కోఆర్డినేట్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వంటివి మనిషి మాత్రమే చేయగలిగే పనులు. కాబట్టి ప్రాజెక్ట్ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్‌ వంటి రోల్స్ కు ఏఐతో ముప్పు లేదు.

ఇక వీటితో పాటు ఏఐతో సరైన విధంగా పని చేయించే ఏఐ ఎథిసిస్ట్స్‌లు, ఏఐ  రీసెర్చర్లు, మిషన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ టూల్ డెవలపర్లకు కూడా టెక్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..