Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్
సూర్యగ్రహణం సందర్భంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం రాత్రి 10:59 గంటలకి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం సందర్భంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది.
మీరు గూగుల్ సెర్చ్‌లో ‘Surya Grahan’ అని టైప్ చేస్తే.. మీరు ఖగోళ సంఘటనకు సంబంధించి మ్యాజిక్ యానిమేషన్‌ను తిలకించే అవకాశం కల్పించింది. ఈ క్రియేటివిటీ ఫీచర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు ప్రత్యేకమైన యానిమేషన్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేస్తున్నారు. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడల్లా గూగుల్ తరచుగా ఒక స్పెషల్ ఫీచర్ రూపొందిస్తోంది. ఈసారి, సెర్చ్ బార్‌లో “Surya Grahan” అని టైప్ చేస్తే చాలు ఇంటరాక్టివ్ యానిమేషన్ ప్రారంభమవుతుంది. ఇందులో చంద్రుని గ్రాఫిక్ సూర్యుని మీదుగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. మీ కంప్యూటర్ స్క్రీన్‌పై చిన్న సూర్యగ్రహణం మాదిరిగా కనువిందు చేస్తుంది. యానిమేషన్‌తో పాటు గ్రహణానికి సంబంధించి పూర్తి కంటెంట్ వీక్షించేందుకు ఆప్షన్ కూడా ఉంది. ముఖ్యమైన సంఘటనలు, పండుగలు లేదా శాస్త్రీయపరమైన అంశాలపై గూగుల్ తరచుగా ఇలాంటి క్రియేటివిటీ యానిమేషన్లను అందిస్తుంది. సూర్య గ్రహణ్ యానిమేషన్ కూడా అలానే రూపొందించింది. ఈ ఫీచర్ యూజర్లను ఆకర్షించేడమే కాకుండా గ్రహణాల వంటి ఖగోళ సంఘటనలపై అవగాహన పెంచుతుంది. చాలా మంది నెటిజన్స్ ఇదొక “మ్యాజిక్ టచ్” అంటున్నారు. సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించడంపై గూగుల్‌ను ప్రశంసించారు. ఆసక్తి ఉన్న యువ విద్యార్థులు, అంతరిక్ష ఔత్సాహికులకు సూర్యగ్రహణాల గురించి మరింత తెలుసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే
మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్.. అధికారులపైనే
మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. మోదీ, పవన్ ప్రత్యేక అభినందనలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

