AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడిపై టార్గెట్ మామూలుగా లేదుగా.. భారత్-జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్‌..

భారత్-జపాన్ దేశాలు కలిసి ఈసారి చంద్రుడిని టార్గెట్ చేశారు. అవును, ఇప్పటి వరకు భారత్ వేరుగా జపాన్ వేరుగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే 2027లో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో, జపాన్ కలిసి సంయుక్తంగా 2027-2028వ సంవత్సరం మధ్యలో చంద్రునిపై అన్వేషణకు మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

చంద్రుడిపై టార్గెట్ మామూలుగా లేదుగా.. భారత్-జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్‌..
Isro And Jaxa Gear Up For Joint Chandrayaan 5
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 29, 2025 | 3:52 PM

Share

భారత్-జపాన్ దేశాలు కలిసి ఈసారి చంద్రుడిని టార్గెట్ చేశారు. అవును, ఇప్పటి వరకు భారత్ వేరుగా జపాన్ వేరుగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే 2027లో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో, జపాన్ కలిసి సంయుక్తంగా 2027-2028వ సంవత్సరం మధ్యలో చంద్రునిపై అన్వేషణకు మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రయోగంలోనే చంద్రయాన్-5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో జపాన్ దేశాలు సన్నాహాలు సన్నద్ధం అవుతున్నారు.

జపాన్ జాతీయ అంతరిక్ష విధాన కమిటీ సభ్యులతో కూడిన ఓ బృందం రెండు రోజుల క్రితం ఇస్రో హెడ్ క్వార్టర్‌లో పర్యటించడం జరిగింది. అనంతరం ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని జపాన్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జపాన్ ఇస్రో దేశాలు ఉమ్మడిగా చేపట్టబోయే చంద్రయాన్- 5 మిషన్ ప్రయోగం గురించి ఇరు సంస్థల కార్యకలాపాలు సహయ సహకారాల గురించి చర్చించారు. తదుపరి జపాన్ ప్రతినిధుల బృందం బెంగళూరులోని యుఆర్ రావు ఉపగ్రహ తయారీ కేంద్రంతో పాటు అక్కడే ఉన్న ఇస్రో సాటిలైట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నట్లు తెలిపారు.

ఇస్రోలో ఉన్న సాంకేతిక సౌకర్యాలను జపాన్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఇస్రో జపాన్ దేశాలు కలిసి పనిచేసే విషయంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణతో జపాన్ ప్రతినిధుల బృందం చర్చించడం జరిగింది. ఏది ఏమైనా 2027సంవత్సరం లేదా 28వ సంవత్సరం మధ్య కాలంలో చంద్రయాన్-5 రాకెట్ ప్రయోగం ద్వారా జపాన్ దేశానికి చెందిన హెచ్ 3 రాకెట్ ద్వారా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రయాన్-5 రాకెట్ ప్రయోగాన్ని చంద్రుని పైకి పంపించి చంద్రునిపై పలు అంశాలతో కూడిన పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చంద్రయాన్-5 రాకెట్‌ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ వెబ్‌సైట్ ద్వారా వెల్లడించారు.

అయితే జపాన్ ఇస్రో సంయుక్తంగా కలిసి చంద్రయాన్-5 అనే రాకెట్ ప్రయోగాన్ని జాక్సా అనే జపాన్ అంతరిక్ష సంస్థ, ఇస్రో కలిసి చంద్రుని దక్షిణ ద్రవం వైపు చంద్రుని కక్షపై ఎలాంటి నిక్షేపాల ఉన్నాయి అనే కోణంలో ప్రధానంగా పరిశోధన చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా చంద్రునిపై నీటి ఉనికిని మ్యాపింగ్ చేయడం, ఎంతెంత నీటి కంటెంట్ ఉంది, దాని నాణ్యత, వాటి కూర్చి సంక్షిప్తంగా విశ్లేషించడానికి చంద్రుని గ్రహంపై డ్రిల్లింగ్ చేయడం, అక్కడి మట్టి నమూనాలు సేకరించి భూమి మీదకు తీసుకుని రానున్నారు. వాటిపై పరిశోధనలు చేపట్టడం ఈ చంద్రయాన్-5 రాకెట్ ప్రయోగం ప్రధాన ఉద్దేశ్యం.

చంద్ర గ్రహంపై వంద రోజులు పాటు ఈ పరిశోధన చేయడానికి చంద్రయాన్-5 అనే రాకెట్ ప్రయోగాన్ని తలపెడుతున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ తరుణంలో జపాన్ అంతరిక్ష సంస్థ రోవర్‌ను తయారు చేయగా ఇస్రో ల్యాండర్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇరు దేశాలు ఇప్పటికే ఓ ఒప్పందానికి వచ్చి చంద్రయాన్..5 రాకెట్ ప్రయోగ ఏర్పాటులో నిమగ్నమయ్యారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..