ఆ ఘనత రిలయన్స్ జియోదే!

ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు తేలింది. ఇందులో దాదాపు 12 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్టు వెంచర్ కేపిటలిస్ట్ మేరీ మీకర్ తెలిపారు. 21 శాతం ఇంటర్నెట్ యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య కేవలం 8 శాతమే అయినా మూడో స్థానంలో ఉంది. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.8 బిలియన్ల మంది (51 శాతం) ఇంటర్నెట్ యూజర్లు యాక్టివ్‌గా ఉన్నారు. కాగా ఇండియాలో […]

ఆ ఘనత రిలయన్స్ జియోదే!

ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు తేలింది. ఇందులో దాదాపు 12 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్టు వెంచర్ కేపిటలిస్ట్ మేరీ మీకర్ తెలిపారు. 21 శాతం ఇంటర్నెట్ యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య కేవలం 8 శాతమే అయినా మూడో స్థానంలో ఉంది. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.8 బిలియన్ల మంది (51 శాతం) ఇంటర్నెట్ యూజర్లు యాక్టివ్‌గా ఉన్నారు.

కాగా ఇండియాలో ఇంటర్నెట్ యూజర్లు పెరగడానికి రిలయన్స్ జియోనే కారణమని నివేదిక పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లు చవగ్గా దొరకడంతోపాటు జియో రాకతో డేటా ధరలు గణనీయంగా తగ్గడం కూడా కారణమని వివరించింది.  ఏడాదిలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 307 మిలియన్లకు చేరుకుందని మీకర్ తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu