AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఫై సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్ పెట్టేయండి

Wi-Fi Extender.. ఇంట్లోని కొన్ని గదుల్లో వైఫై సిగ్నల్ సరిగ్గా అందక కొత్త రూటర్ లేదా ఎక్స్‌టెండర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ వద్ద ఎందుకు పనికిరాదని పక్కన పడేసిన పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సమస్యను ఇట్టే చక్కబెట్టుకోవచ్చు. తాత్కాలికంగా ఇంటర్నెట్ కనెక్షన్‌ను మరో ప్రాంతానికి విస్తరించే ఈ అద్భుతమైన ట్రిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వైఫై సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్ పెట్టేయండి
Turn Your Old Android Phone Into A Free Wi Fi Extender
Nikhil
|

Updated on: Sep 03, 2026 | 9:10 PM

Share

ఆధునిక కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఇళ్లలో ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రూటర్‌కు దూరంగా ఉన్న గదుల్లో సిగ్నల్ రాకపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త పరికరాలు కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మూలన పడి ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వైఫై సిగ్నల్‌ను ఎలా రిపీట్ చేయాలో ఇప్పుడు సులభంగా నేర్చుకుందాం.

పాత ఫోన్‌ను వైఫైకి కనెక్ట్ చేయడం

మీ వద్ద ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ముందుగా మీ ఇంటి ప్రధాన వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవాలి. అందుకోసం ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ ఆప్షన్‌లోకి వెళ్లి వైఫై ఎంచుకుని పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అదే సెట్టింగ్స్‌లో వైఫై హాట్‌స్పాట్ లేదా టెథరింగ్ ఆప్షన్‌ను ఓపెన్ చేసి హాట్‌స్పాట్‌ను ఆన్ చేయాలి. అవసరమైతే నెట్‌వర్క్ పేరు, పాస్‌వర్డ్‌ను మీ ఇష్టానుసారం మార్చుకోవచ్చు. మీ ఫోన్‌లో ఫైవ్ గిగాహెర్జ్ హాట్‌స్పాట్ ఆప్షన్ అందుబాటులో ఉంటే మెరుగైన ఇంటర్నెట్ స్పీడ్ కోసం దాన్ని ఎంచుకోవడం మంచిది.

ఫోన్ ఉంచాల్సిన సరైన స్థలం

తయారు చేసుకున్న ఈ పాత ఫోన్‌ను వైఫై రూటర్‌కు, సిగ్నల్ సరిగ్గా రాని గదికి మధ్యలో ఉండే సరైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌కు రూటర్ సిగ్నల్ బలంగా అందుతుంది అలాగే హాట్‌స్పాట్ ద్వారా మరో ప్రాంతానికి కనెక్షన్ సజావుగా వెళ్తుంది. అయితే హాట్‌స్పాట్‌ను నిరంతరం ఆన్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ చాలా త్వరగా ఖాళీ అవుతుంది. కాబట్టి ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచడం ఉత్తమం. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా అత్యవసర సమయాల్లో ఇంట్లో వైఫై సమస్యను ఎదుర్కొనేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

Follow Us