Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై సంతం చేశారు.ఈ మేరకు ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై సంతం చేశారు.ఈ మేరకు ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతు ముందే లోక్ భవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్, అజారుద్దీన్ సైతం వెళ్లారు. అక్కడ కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ కాసేపటికే గవర్నర్ కొండా సురేఖ బర్తరఫ్‌ను ఆమోదిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.
అయితే కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిపోవడంతో ఇప్పుడు ఆ పదవి ఖాళీ అయింది. దీంతో తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వంలో రెండు పదువలు ఖాళీగా ఉండగా ఇప్పుడు కొండా సురేఖ బర్తరఫ్‌తో 3కు చేరాయి. ఈ నేపథ్యంలో కేబినెట్‌ను కూడా విస్తరించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో మాట్లాడినట్టు సమాచారం. వీలైతే ఈ నెల 6వ తేదీని కేబినెట్‌ను విస్తరించేకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ నుంచి సీఎంవో ఆదేశాలు అందిన వెంటనే ఆమె చాంబర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సచివాలయంలోని 4వ ఫ్లోర్‌లో ఉన్న కొండా సురేఖ చాంబర్ పూర్తిగా ఆదీనంలోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
