Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
Saidabad Steel Bridge Open: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చెప్పేందుకు రూ.625 కోట్లో 3.25 కి.మీ మేర నిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ భారీ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది.

హైదరాబాద్ ,సెప్టెంబర్ 02: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ ప్లైఓవర్లను ప్రయాణికులు అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్ తాజాగా మరో భారీ ఫ్లైఓవర్‌ను ఓపెన్ చేసింది. రూ.625 కోట్లతో 3.25 కి.మీ. మేర సైదాబాద్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లోనే మూడో అతి పెద్ద ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మలక్‌పేట, సంతోష్‌నగర్, సైదాబాద్, కంచన్‌బాగ్, చంచల్‌గూడ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణ సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా చేపట్టినట్టు తెలిపారు. సైదాబాద్ బ్రిడ్జికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని.. ఒవైసీ చెప్పడంతో బ్రిడ్జి పనులు వేగంగా పూర్తిచేశామని చెప్పారు. సీఎం కాగానే అసద్‌తో కలిసి పాతబస్తీలో తిరిగానని.. 70 ఏళ్లలో ఒక్క సీఎం అయినా పాతబస్తీ వచ్చారా అని ప్రశ్నించారు. అసద్, MIM దేశానికి వ్యతిరేకమని కొందరి దుష్ప్రచారం చేస్తు్న్నారని.. దేశభక్తి విషయంలో అసద్, అక్బర్ ముందుంటారన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీకి మెట్రో వస్తుందని.. పాతబస్తీకి మెట్రోలో వచ్చి ఓట్లడుగుతామన్నారు. ఓల్డ్‌సిటీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మించడమే లక్ష్యమన్నారు. గుజరాత్‌లో సబర్మతి సుందరీకరణ చేయొచ్చు, యూపీలో గంగానదిని సుందరీకరణ చేయొచ్చు.. కానీ హైదరాబాద్‌లో మూసీనదిని మాత్రం బాగు చేయొద్దంటున్నారని మండిపడ్డారు.
అలాగే అసదుద్దీన్ మాట్లాడుతూ సైదాబాద్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ పూర్తిచేశారని.. బీఆర్‌ఎస్ పనులు మొదలుపెట్టి నిధులు ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికలలోపు ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయాలని.. ఓల్డ్ సిటీలో 95 శాతం భూసేకరణ పూర్తయిందని అన్నారు. జియాగూడలో స్లాటర్ హౌస్ నిర్మించాలని.. పాతబస్తీలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించాలి ఓవైసీ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
