AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS శాశ్వత్ సంగ్వాన్ సక్సెస్ స్టోరీ.. మాక్ ఇంటర్వ్యూలో బ్యాక్‌గ్రౌండ్‌ విని అవాక్కైన ప్యానెల్

UPSC మాక్‌ ఇంటర్వ్యూలో IAS శాశ్వత్ సంగ్వాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఆసక్తికరంగా మారింది. BITS పిలానీలో ఇంజినీరింగ్‌ చదివిన ఆయన తొలుత మల్టీనేషనల్‌ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా, ఆ తర్వాత వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌లో శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా మారథాన్‌ రన్నర్‌, నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా తన పరిచయం చెప్పడంతో ఇంటర్వ్యూ ప్యానెల్‌ ఆయన ప్రొఫైల్‌పై ఆసక్తి చూపింది..

IAS శాశ్వత్ సంగ్వాన్ సక్సెస్ స్టోరీ.. మాక్ ఇంటర్వ్యూలో బ్యాక్‌గ్రౌండ్‌ విని అవాక్కైన ప్యానెల్
IAS Shashwat Sangwan UPSC Mock Interview
Srilakshmi C
|

Updated on: Sep 04, 2026 | 4:58 PM

Share

సివిల్ సర్వీసెస్‌ అభ్యర్థులకు UPSC ఇంటర్వ్యూ అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభవం. అభ్యర్థి చదువు, ఉద్యోగ అనుభవం, వ్యక్తిత్వం, హాబీలు, సామాజిక అవగాహన వంటి అనేక అంశాలను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా శాశ్వత్ సంగ్వాన్ అనే అభ్యర్థికి సంబంధించిన ఓ మాక్ ఇంటర్వ్యూ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇంటర్వ్యూ ప్రారంభం నుంచే అభ్యర్థి ప్రొఫైల్‌పై బోర్డు దృష్టి సారించింది. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు శాశ్వత్ సంగ్వాన్ ‘May I come in?’ అంటూ అనుమతి కోరారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయనను లోపలికి ఆహ్వానించారు. ‘Have you seen Shashwat?’ అంటూ సరదాగా ప్రారంభమైన సంభాషణ తర్వాత అభ్యర్థిని కూర్చోమని సూచించారు. ‘Introduce yourself’ అని బోర్డు సభ్యులు అడగడంతో శాశ్వత్ చెప్పింది వినీ అంతా సైలెంట్ అయ్యారు.

డేటా సైంటిస్ట్‌గా కెరీర్.. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలో..

శాశ్వత్ సంగ్వాన్ తన స్వస్థలం భివానీ జిల్లాలోని హర్యానా అని తెలిపారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. తనకు విస్తృతమైన సాంస్కృతిక, వృత్తిపరమైన అనుభవం ఉందని వివరించారు. తొలుత ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో Data Scientistగా పనిచేశానని, ఆ తర్వాత వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని India Trade Promotion Organisation (ITPO)లో పనిచేశానని చెప్పారు. వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవం తనకు భిన్నమైన పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని ఆయన పరిచయం ద్వారా స్పష్టమవుతోంది.

జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు.. మారథాన్‌ రన్నర్!

ప్రస్తుతం తాను Indian Defence Estates Service (IDES)కు శిక్షణ పొందుతున్నట్లు శాశ్వత్ తెలిపారు. UPSC 2020 ఆధారంగా ఈ సర్వీసును కేటాయించినట్లు వివరించారు. ఇలా ప్రైవేట్‌ రంగంలోని డేటా సైన్స్‌ ఉద్యోగం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం సంపాదించి, చివరకు సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టిన తన ప్రయాణాన్ని బోర్డు ముందు వివరించారు. ఇంటర్వ్యూలో శాశ్వత్‌ తన హాబీలు, క్రీడా నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. తాను మారథాన్‌ రన్నర్‌నని, అంతేకాకుండా National Basketball Playerనని చెప్పారు. అభ్యర్థి తనను తాను పరిచయం చేసుకున్న వెంటనే బోర్డు సభ్యుడు ఆయన చెప్పిన క్రీడా నేపథ్యంపై ప్రత్యేకంగా స్పందించారు. ‘You run marathon and you are a national basketball player?’ అంటూ ఆసక్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిత్వం, క్రీడలపై ఆసక్తి, సమయ నిర్వహణ, క్రమశిక్షణ వంటి అంశాలపై తదుపరి చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

UPSC ఇంటర్వ్యూలో ఎందుకు ముఖ్యమైనది?

UPSC Personality Testలో కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు. విద్యా నేపథ్యం, ఉద్యోగ అనుభవం, హాబీలు, క్రీడలు, స్వస్థలం వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులు తమ Detailed Application Form (DAF)లో పేర్కొన్న ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా హాబీలుగా పేర్కొన్న అంశాలను కేవలం పేరుకే కాకుండా వాటికి సంబంధించిన ప్రాథమిక, సమకాలీన విషయాలను కూడా తెలుసుకోవాలి. శాశ్వత్‌ సంగ్వాన్‌ తన బయోడేటాలో ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌, ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం, Indian Defence Estates Service, మారథాన్‌, జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ వంటి విభిన్న అంశాలు ఉండటంతో.. వీటిపైనే బోర్డు నుంచి మరిన్ని ప్రశ్నలు సంధించారు. UPSC ఇంటర్వ్యూలో మీ ప్రొఫైల్‌లోని ప్రతి అంశం ఒక ప్రశ్నకు దారి తీస్తుందనే విషయాన్ని ఈ మాక్ ఇంటర్వ్యూ గుర్తుచేస్తోంది.

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..