AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత

Sathupalli Anganwadi Food Poisoning: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కిష్టారం అంగన్‌వాడీ కేంద్రంలో గన్నేరు ఆకులు కలిసిన పప్పు అన్నం తిని ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.

గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
Sathupalli Anganwadi Food Poisoning
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 6:39 PM

Share

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిష్టారంలోని 3 వ సెంటర్ అంగన్ వాడీ కేంద్రంలో సెప్టెంబర్ 1వ తేదీన చిన్నారులకు అంగన్ వాడీ హెల్పర్ గోంగూర పప్పుతో వండిన అన్నం పెట్టారు. అయితే అంగన్ వాడీ ఆవరణలో ఉన్న గోంగూర చెట్లతో పాటు పూలు పూసే గన్నేరు మొక్కలు కూడా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన గోంగూరతో పాటు గన్నేరు చెట్ల ఆకులను కూడా కోసి గమనించకుండా పప్పు వండటం జరిగింది. ఆ పప్పు అన్నం తిన్న ముగ్గురు చిన్నారులతో పాటు పిల్లలకు అన్నం తినిపిస్తూ రెండు ముద్దలు అన్నం తిన్న ఇద్దరు తల్లులు కూడా అస్వస్థత కు గురైనారు. దీంతో హుటాహుటిన ముగ్గురు చిన్నారులను ఇద్దరు తల్లులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై అంగన్ వాడీ సత్తుపల్లి CDPO సత్యవతి వివరణ కోరగా.. పిల్లలు, తల్లులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని, జిల్లా మెడికల అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పిల్లలు, తల్లులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆమె తెలిపారు.

Follow Us
అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు..
అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు..
లారీపై తరలిస్తుండగా ఊహించని ప్రమాదం.. ధ్వంసమైన గణేష్ విగ్రహం
లారీపై తరలిస్తుండగా ఊహించని ప్రమాదం.. ధ్వంసమైన గణేష్ విగ్రహం
Money Tips: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా?
Money Tips: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా?
‏అప్పుడు మిస్సైంది.. తర్వాత.. బ్లాక్ బస్టర్స్ చేసింది..
‏అప్పుడు మిస్సైంది.. తర్వాత.. బ్లాక్ బస్టర్స్ చేసింది..
నూడుల్స్‌ వద్దు.. ఇంట్లోని బియ్యంతోనే అదిరిపోయే స్నాక్!
నూడుల్స్‌ వద్దు.. ఇంట్లోని బియ్యంతోనే అదిరిపోయే స్నాక్!
'దేవి' హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? క్లారిటీ ఇచ్చేసిందిగా
'దేవి' హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? క్లారిటీ ఇచ్చేసిందిగా
రోజూ ఒకే పండు తినడం బెటరా?.. ఒక్కో రోజు ఒక్కో పండు తినాలా?
రోజూ ఒకే పండు తినడం బెటరా?.. ఒక్కో రోజు ఒక్కో పండు తినాలా?
ఈ మహిళా రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందలేరు.. ఎందుకో తెలుసా?
ఈ మహిళా రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందలేరు.. ఎందుకో తెలుసా?
కివీ కొనలేకపోతున్నారా? డెంగ్యూ పేషెంట్లకు ఇవి కూడా మంచివే!
కివీ కొనలేకపోతున్నారా? డెంగ్యూ పేషెంట్లకు ఇవి కూడా మంచివే!
చొక్కా జేబు ఎడమ వైపే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
చొక్కా జేబు ఎడమ వైపే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!