Aadi Movie: ఆది సినిమాను మిసైంది.. కట్ చేస్తే.. ఎన్టీఆర్‌తో బ్లాక్స్ బస్టర్స్ చేసిన హీరోయిన్..
డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ కథ మొదట బాలకృష్ణకు చెప్పడం, తర్వాత ఎన్టీఆర్‌తో చిత్రీకరించడం, కథానాయికగా ఆమె ఎంపిక, రాయలసీమలో షూటింగ్ అనుభవాలను వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఆది విజయం తన జీవితాన్ని మార్చిందని ఆయన పేర్కొన్నారు.

దర్శకుడు వి.వి. వినాయక్ సినిమాలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆది సినిమా నిర్మాణ విశేషాలను, జూనియర్ ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్‌లతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిందని అన్నారు. ఆది కథ పుట్టుక గురించి వివరిస్తూ, ఈ స్క్రిప్టును మొదట తాను నందమూరి బాలకృష్ణకు వినిపించినట్లు వినాయక్ వెల్లడించారు. బాలకృష్ణకు కథ బాగా నచ్చిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌కు అర్థం ఇదే..
ఆ తర్వాత, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో తీయాలని సూచించినట్లు వినాయక్ తెలిపారు. ఎన్టీఆర్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నప్పుడు, ఆయన అప్పటికి చాలా యువకుడైనప్పటికీ, ఆయనలో ఉన్న అపారమైన శక్తి, అంకితభావం తనను ఆకట్టుకున్నాయని దర్శకుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు, ఆయన శరీర భాషకు తగ్గట్టుగా కథలో పెద్దగా మార్పులు చేయకుండా, కొన్ని సన్నివేశాలు, సంభాషణలలో మాత్రమే చిన్నపాటి సవరణలు చేసినట్లు వినాయక్ చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ చూపించిన ఎఫర్ట్, అద్భుతమైన ప్రదర్శన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు.
ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుతూ, చిత్ర బృందం చాలామంది నటీమణుల కోసం అన్వేషణ సాగించిందని చెప్పారు. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ ఫోటోలు చూసినట్లు, ఆమెను ముంబై వెళ్లి కలిసినట్లు వినాయక్ గుర్తుచేసుకున్నారు. మొదటి చూపులోనే ఆమె ఆది సినిమాలో కథానాయిక పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించిందని ఆయన తెలిపారు. కానీ ఆమె అప్పటికే మరో సినిమాను ఒప్పుకోవడంతో ఆది సినిమా మిస్సైందని తెలిపారు. ఇక తర్వాత ఎన్టీఆర్ జోడిగా అల్లరి రాముడు చిత్రంలో నటించింది ఆర్తి అగర్వాల్. 2002లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.
ఆర్తి అగర్వాల్ ఫోటో..

Aarti Agarwal
ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..
