AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prema: ‘దేవి’ హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లిందా? క్లారిటీ ఇచ్చేసిందిగా

తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార. తన హోమ్లీ లుక్స్, అద్భుతమైన నటనతో తెలుగు సినీ అభిమానుల మనసులు గెల్చుకుంది.

Actress Prema: 'దేవి' హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లిందా?  క్లారిటీ ఇచ్చేసిందిగా
Actress Prema
Basha Shek
|

Updated on: Sep 03, 2026 | 6:31 PM

Share

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ప్రేమ. అందులో ఆమె అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పాటు ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. జగదేకవీరుడు, అదిరింది గురు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి, నాగదేవత, అమ్మో ఒకటో తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతో రా తదితర చిత్రాలలో నటించి మెప్పించిందీ అందాల తార. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు కన్నడం, తమిళ్ భాషల్లోనూ పలు సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్ గా కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది ప్రేమ. 2006లో వ్యాపార వేత్త జీవన్ అప్పచున్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2016లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. దీని కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరమైన ప్రేమ ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సినిమాల్లో తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు.

అయితే ప్రేమ వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్లు వచ్చాయి? రెండో పెళ్లికి రెడీ అవుతోందని, అలాగే ఆమె ఆరోగ్యం విషయంలోనూ పలు పుకార్లు వినిపించాయి. ప్రేమకు ఏకంగా క్యాన్సర్ సోకిందని, అందుకే న్యూజిలాండ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఊహాగానాలు వినిపించాయి. దీంతో సినీ అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రేమ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన వ్యక్తిగత జీవితంపై వస్తోన్న రూమర్లపై ఇలా స్పందించారు. ‘నా గురించి లేనిపోని రూమర్లు క్రియేట్ చేశారు. నేను న్యూజిలాండ్‌లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వచ్చాను. దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి అ నారోగ్యం లేదు. కానీ కొందరు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. వాటి వల్ల నేనింకా స్ట్రాంగ్‌గా మారాను. మా అమ్మనాన్నలు ప్రతి విషయంలో నాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే.. ఎలా సమాధానం ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు… వాళ్లు నన్ను స్టార్‌లా చూడరు, వారితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను’ అని ప్రేమ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us