AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్ యాక్టింగ్ కోసమైనా చూడాలి

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడీ మూవీ సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఏకంగా 5 ఓటీటీల్లో..

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్ యాక్టింగ్ కోసమైనా చూడాలి
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 03, 2026 | 7:55 AM

Share

సాధారణంగా సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వస్తాయి. అయితే ఒక సూపర్ హిట్ సినిమా ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేసింది. కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘అనంతన్ కాడు’. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. పేరుకు గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినప్పటికీ 90ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. 1990ల కాలంలో తిరువనంతపురంలో స్థానిక వీధి రౌడీలు ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు శ్రీలంక తమిళ తిరుగుబాటుదారుడితో చేతులు కలపడం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. హీరో ఆర్య ఈ సినిమాలో శ్రీలంక తమిళన్ పాత్రలో కనిపించడం విశేషం. సినిమాలో ఆయన లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘తియాన్’ చిత్రం తర్వాత దర్శకుడు జియేన్ కృష్ణకుమార్, రచయిత మురళి గోపి మళ్లీ కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ ‘అనంతన్ కాడు’. హీరో ఆర్యతో పాటు టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్, రెజినా కసాండ్రా, అజయ్, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, అచ్యుత్ కుమార్, శాంతి బాలచంద్రన్ వంటి ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి అనంతన్ కాడు ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

అనంతన్ కాడు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??
బ్యాంకు ఖాతాదారులకు RBI అలర్ట్.. రీ-కేవైసీపై అప్డేట్..
బ్యాంకు ఖాతాదారులకు RBI అలర్ట్.. రీ-కేవైసీపై అప్డేట్..
హైదరాబాద్‌లో పవర్ బ్యాంక్ పేలుడు.. ఛార్జింగ్‌లో ఉండగా భారీ బ్లాస్
హైదరాబాద్‌లో పవర్ బ్యాంక్ పేలుడు.. ఛార్జింగ్‌లో ఉండగా భారీ బ్లాస్
జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు..రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి
జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు..రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి
ఇవాళే OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
ఇవాళే OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్