Smartphone Hanging Problem: మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయ్యిందా.. రీజన్స్ తెలిస్తే.. సాల్వ్ చేసుకోవడం ఈజీ
Smartphone Hanging Problem: చిన్న పెద్ద, పేద ధనిక ఇలా ఏ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉండాల్సిందే..ఇంకా చెప్పాలంటే తినడానికి తిండి లేక పోయినా ఉంటారు కానీ.. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే బతకలేరు అన్నచందంగా...
Smartphone Hanging Problem: చిన్న పెద్ద, పేద ధనిక ఇలా ఏ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉండాల్సిందే..ఇంకా చెప్పాలంటే తినడానికి తిండి లేక పోయినా ఉంటారు కానీ.. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే బతకలేరు అన్నచందంగా మారిపేయింది. అంతగా స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగమయ్యింది. అయితే ఒకొక్కసారి ఫోన్ హ్యాంగ్ అయ్యి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక ఆలోచిస్తుంటారు.. లేదంటే రిపేర్ షాప్ కు పరిగెడతారు. అసలు ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు తెలుసుకుందాం..!
ముఖ్యంగా ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి ఫోన్ లో ఎక్కువగా యాప్స్ ఓ కారణం కావచ్చు. చాలా మంది ఫోన్లలో యాప్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిల్లో కొన్నింటిని ఉపయోగించేది బహు అరుదు.. ఇలా ఎక్కువ యాప్స్ ఉన్నవాళ్ళ ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి మొదటి కారణం అని అంటున్నారు. ఈ యాప్స్ ఫోన్ పనితీరుపై ప్రభావం చుపిస్తాయని.. ర్యామ్ పర్ఫార్మెన్సును తగ్గిస్తాయని, ముఖ్యంగా ఈ యాప్స్ ఆటొమ్యాటిగ్గా అప్డేట్ అవుతుంటాయి. ఫలితంగా, ఫోన్ స్టోరేజి కూడా నిండిపోతుంది. ఇవన్నీ కలిసి ఫోన్ సమస్యను తీవ్రతరం చేస్తాయి. ఇక ఫోన్ అప్డేట్ చెయ్యకపోయినా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్స్ ఎల్లప్పుడూ అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను ఉపయోగించాలి. ఫోన్లో ఏదైనా క్రొత్త అప్డేట్స్ ఉన్నాయా అని చూడటానికి ఫోన్ సెట్టింగ్స్ ఎంపికకు వెళ్లండి. ఫోన్ అప్డేట్ అయితే హ్యాంగింగ్ సమస్య తగ్గుతుంది. ఇక ఫోటోలు, వీడియో లతో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఫోన్ స్టోరేజ్ ను ఎప్పటికపుడు ఖాళీ చేస్తుండాలి. ముఖ్యంగా ఫోన్ ఛార్జర్ ను ప్రోపర్ గా వాడాలి.. ఏ ఫోన్ ఛార్జర్ ను ఆఫోన్ కు మాత్రమే ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించాలి.
Also Read: నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే.. అంటూ కార్తీక్ వార్నింగ్ .. తప్పులను గుర్తుచేసుకుంటూ షాక్‌లో మోనిత