- Telugu News Photo Gallery Technology photos If you want to increase your smart phone battery life fallow these tips for save phone battery
Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతోందా? మరేం పర్వాలేదు ఇలా చేయండి.. బ్యాటరీ లైఫ్ పెంచుకోండి..
Battery Life: Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతోందా? మరేం పర్వాలేదు ఇలా చేయండి.. బ్యాటరీ లైఫ్ పెంచుకోండి..
Updated on: Apr 16, 2021 | 12:47 PM

అన్నింటికంటే ముఖ్యమైనది మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని పూర్తిగా డౌన్ అయ్యే వరకు చూడొద్దు. బ్యాటరీ చార్జ్ ఎప్పుడూ 20శాతం తగ్గకుండా చూసుకోవాలి. పూర్తిగా డౌన్ అయ్యే వరకు ఉపయోగించి.. ఆ తరువాత చార్జింగ్ పెట్టుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే ఎప్పటికప్పుడు చార్జింగ్ చూసుకోవాలి.

మరో కీలక విషయం.. మీ ఫోన్లకు రాత్రంతా ఛార్జింగ్ పెట్టవద్దు. ఓవర్ చార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఫలితంగా క్షణాల్లోనే బ్యాటరీ అయిపోతుంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్త పాటించండి.

ఫోన్ చార్జింగ్‌ను ఎప్పుడూ వందశాతం పెట్టొద్దు. 90శాతం ఫోన్ చార్జింగ్ అవగానే తీసేయడం చాలా మంచింది. దీని వల్ల ఓవర్ చార్జింగ్‌ను నివారించడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

మీ స్మార్ట్ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ నిత్యం ఆన్‌చేసి పెడుతున్నారా? అయితే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతింటుంది. ఈ రెండూ చార్జింగ్‌ను ఎక్కువగా లాగేస్తాయి. అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం లేనప్పుడు ఆ రెండింటినీ ఆఫ్ చేయాలి.

అనాథరైజ్‌డ్ చార్జర్లతో మీ ఫోన్లకు ఎప్పుడూ చార్జింగ్ పెట్టకండి. అలా చేయడం వల్ల అవి ఫోన్ బ్యాటరీని హీటెక్కిస్తాయి. మీ బ్యాటరీ మనుగడకే ముప్పు తీసుకువస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటేంట.. మీ ఫోన్‌లలో ఉపయోగించని యాప్‌లను తొలగిస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఆ యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ను టర్నాఫ్ చేయండి. ఇలా చేయడం ద్వారా చార్జింగ్ ఎక్కువ కాలం నిలుస్తుంది.




