Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Windows 12: విండోస్ 12 వచ్చేస్తోంది! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సిస్టమ్.. లాంచింగ్ ఎప్పుడంటే..

మైక్రోసాఫ్ట్ సంస్థ.. తన విండోస్ 12 కి సంబంధించిన గ్లిమ్స్ ని విడుదల చేసింది. లాస్ వేగాస్ లో జరుగుతున్న కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.

Windows 12: విండోస్ 12 వచ్చేస్తోంది! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సిస్టమ్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Windows 12 AI
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2023 | 2:53 PM

టెక్ ప్రియులకు శుభవార్త. మైక్రోసాఫ్ట్ నుంచి మరో వెర్షన్ విండోస్ వచ్చేస్తోంది. ఎప్పటికే 11 వెర్షన్లను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ.. తన విండోస్ 12 కి సంబంధించిన గ్లిమ్స్ ని విడుదల చేసింది. లాస్ వేగాస్ లో జరుగుతున్న కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ విండోస్ 12 అప్ డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే..

విండోస్ 12 కు సంబంధించిన ఓ అప్ డేట్ ను సీఈఎస్ 2023లో ఏఎండీ ప్రకటించింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను వచ్చే పదేళ్లలోపు వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఫీచర్లను మాత్రమే పొందుపచినట్లు వెల్లడించింది. అందులో అత్యంత శక్తి వంతమైన చాటాబోట్, చాట్ జీపీటీ(ChatGPT)ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని కోసం ప్రత్యేక ఆర్టిఫీషియల్ మోడల్ ను తీసుకురానున్నట్లు ఏఎండీ పేర్కొంది. దీనిని సీపీయూకి బదులుగా జీపీయూ అనుసంధానించేలా ప్లాన్ చేస్తుంది.

ప్రధానంగా వీటి కోసం..

జూమ్ మీటింగ్స్ నిర్వహించే క్రమంలో డెస్క్ టాప్ లలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జోడించడంతో పరిష్కరించవచ్చని ఏఎండీ చెబుతోంది. బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయినట్లు కనిపించడం, ఎప్పుడూ కెమెరా వైపు చూస్తూ ఉండాల్సి రావడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. తొలుత వీటిని అధిగమించేలా కొత్త సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది..

ఈ విండోస్ 12 వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసరికి మరో పదేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఏఎండీ నెక్ట్స్ జనరేషన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన పర్సనల్ కంప్యూటర్లు ఈ ఏడాదే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..