Best Smartphones Under 25K: మిడ్ రేంజ్‌లో టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. సరికొత్త డిజైన్లు.. సూపర్ ఫీచర్లు..
మిడ్ రేంజ్ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టాప్ స్పెక్స్.. హైలైట్ డిజైన్, సూపర్ ఫీచర్లతో ఉండే ఈ ఫోన్లను ఎక్కువ శాతం ఇష్టపడుతుంటారు. అయితే వీటిల్లో బెస్ట్ బ్రాండ్లకు చెందిన ఫోన్లను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో మోటోరోలా, నథింగ్, శామ్సంగ్, రియల్ మీ, రెడ్ మీ వంటివి ఉన్నాయి. ఈక్రమంలో మీరు కనుక ఈ రేంజ్ అంటే రూ. 10వేల నుంచి రూ. 25వేల వరకూ ఉండే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మిస్ కాకండి.

మిడ్ రేంజ్ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టాప్ స్పెక్స్.. హైలైట్ డిజైన్, సూపర్ ఫీచర్లతో ఉండే ఈ ఫోన్లను ఎక్కువ శాతం ఇష్టపడుతుంటారు. అయితే వీటిల్లో బెస్ట్ బ్రాండ్లకు చెందిన ఫోన్లను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో మోటోరోలా, నథింగ్, శామ్సంగ్, రియల్ మీ, రెడ్ మీ వంటివి ఉన్నాయి. ఈక్రమంలో మీరు కనుక ఈ రేంజ్ అంటే రూ. 10వేల నుంచి రూ. 25వేల వరకూ ఉండే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మిస్ కాకండి. ఎందుకంటే దీనిలో మీరు కొనుగోలు చేయదగిన బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా జీ34..
గతేడాది డిసెంబర్లో లాంచ్ అయిన మోటోరోలా జీ34 ఫోన్లో స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ ఫోన్ దీనికి దాదాపు రెట్టింపు ధర కలిగిన ఈ ఫోన్లో ఉండే ఫీచర్లను కలిగి ఉంది. దీనిలో 6.5-అంగుళాల హెచ్డీ ప్లస్ 120Hహెర్జ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. దీనికి వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ మాక్రో సెన్సార్ ను కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో వస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర దీనికి మరో రూ. 1000 అదనంగా ఉంటుంది.
నథింగ్ ఫోన్ (2ఎ)..
ఇటీవల ప్రారంభించిన నథింగ్ ఫోన్ (2ఎ) క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇది 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ని కలిగి ఉంటుంది. దీనిలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుకవైపు గ్లాస్ కి బదులు ప్లాస్టిక్ ఇచ్చారు. గ్లిఫ్ ఎల్ఈడీలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 23,999గా ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఏ34..
2023లో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఎస్అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 1000 నిట్ల బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ యూఐ 5ఆధారంగా నడుస్తుంది. నాలుగు సంవత్సరాల వరకూ అప్ డేట్లను అందిస్తోంది. ఇది 8ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్‌తో కూడిన 48ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఐపీ67తో నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. మీరు 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,499కి అందుబాటులో ఉంది.
రియల్ మీ 12 ప్రో..
మంచి టెలిఫోటో లెన్స్ తో కూడిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది మీకు బెస్ట్ చాయిస్. దీనిలో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. 6.70 అంగుళాల 120హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం లుక్ లో లెదర్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. రియల్ మీ 12 ప్రో ఫోన్ 2x ఆప్టికల్ జూమ్, 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 32ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీని ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే పలు బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ. 25,000లోపు ధరలోనే పొందుకోవచ్చు.
పోకో ఎక్స్6 ప్రో..
ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ 8300 అల్ట్రా ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్ అప్‌డేట్‌ను అందుకుంది. 6.67-అంగుళాల 1.5కే 120హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1,800 నిట్‌ల వరకు వెళ్లగలదు. 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌తో 64ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 25,999 నుంచి మొదలవుతోంది. అయితే పలు బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ. 25,000 లోపు ధరలోనే అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








