SBI Password Tips: ఎవరూ బ్రేక్ చేయలేని పాస్‌వర్డ్.. మీకు మాత్రం చాలా సులభంగా గుర్తుంటుంది.. ఎలా చేయాలంటే..
చాలా మంది ఈజీగా గుర్తుంటుందని, లేక కష్టంగా ఉంటే మర్చిపోతామన్న భావనలో ఫోన్ నంబర్లు, వరుసగా అక్షరాలు, నంబర్లు పాస్ వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. ఇది సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది. ఈజీగా పాస్ వర్డ్ లను హ్యాక్ చేసి మన ఖాతాలను కొల్లగొడుతున్నారు.

ఇటీవల కాలంలో సైబర్ ముప్పు పెరిగింది. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతుంటే.. అంతే స్థాయిలో వ్యక్తిగత డేటా భద్రతకూ ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌కు సంబంధించిన లావాదేవీల విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు మన కళ్లుగప్పి సర్వస్వం దోచేస్తారు. ప్రధానంగా పాస్ వర్డ్ ల భద్రత చాలా ప్రధానం. ఎంత సెక్యూర్‌గా పాస్ వర్డ్ ఉంటే అంత మంచిది. అయితే చాలా మంది ఈజీగా గుర్తుంటుందని, లేక కష్టంగా ఉంటే మర్చిపోతామన్న భావనలో ఫోన్ నంబర్లు, వరుసగా అక్షరాలు, నంబర్లు పాస్ వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. ఇది సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది. ఈజీగా పాస్ వర్డ్ లను హ్యాక్ చేసి మన ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పాస్ వర్డ్‌ను ఎలా పెట్టుకోవాలి అనే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సూచనలు చేస్తుంది. పాస్ వర్డ్ ఏవిధంగా పెట్టుకుంటే సెక్యూర్ గా ఉంటుందో వివరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
పాస్ ఫ్రేజ్ టెక్నిక్..
ఎస్‌బీఐ పాస్ వర్డ్ పెట్టుకునేందుకు పాస్ ఫ్రేజ్ టెక్నిక్ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఈ విధానంలో పాస్ వర్డ్ స్ట్రాంగ్ ఉండటంతో పాటు ఈజీగా గుర్తుంటుందని పేర్కొంది. అలాగే హ్యాకర్లకు ఈ పాస్ వర్డ్‌లు క్రాక్ చేయడం అంత సులభం కాదని వివరించింది.



Always make a habit to have a strong password. Stay alert and #StaySafeWithSBI#SBI #AmritMahotsav #CyberSecurity pic.twitter.com/xc0EdUAGkJ
— State Bank of India (@TheOfficialSBI) May 4, 2023
ఈ వీడియోలో ఓ ఉదాహరణతో ఎస్‌బీఐ పాస్ వర్డ్ సెట్టింగ్ ను వివరించింది. ఇది ఫ్రేజ్ మోడల్ అంటే.. ఏవైనా కొన్ని పదాల సమూహాన్ని వినియోగించి పాస్ వర్డ్ పెట్టుకోవాలని సూచించింది. ఉదాహరణకు I was at Bandra Street and paid Rs 49 అనే సెంటెన్స్ నుంచి ‘Is@Be&49’ ఈ పాస్ వర్డ్ ని క్రియేట్ చేసింది. ఇది మీ సెంటెన్స్ దగ్గరగా ఉంటుంది. కానీ మధ్యలో స్పెషల్ కేరక్టర్ యాడ్ చేయడంతో పాస్ వర్డ్ స్ట్రాంగ్‌గా మారిపోయింది. మీరు దీనిని సెంటెన్స్ ఆధారంగా పెట్టారు కాబట్టి సులభంగా గుర్తుంటుంది.
ఇలా ఉంటే భద్రం..
- మీ పాస్ వర్డ్ కనీసం ఎనిమిది అక్షరాలతో ఉండాలి.
- వాటిల్లో కనీస ఒకటి లేదా రెండు నంబర్లు ఉండాలి.
- అలాగే ఒకటి లేదా రెండు స్పెషల్ క్యారెక్టర్లు ఉండాలి.
- అలాగో ఒక అప్పర్ కేస్, ఒక లోవర్ కేస్ వినియోగించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




