AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం మరింత ఈజీ.. గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో అదిరే ఫీచర్..

గూగుల్ ట్రాన్స్‌లేట్ తన యూజర్ల కోసం ఒక విప్లవాత్మకమైన అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ఈ యాప్ కేవలం పదాలను ట్రాన్స్‌లేట్ చేయడానికే పరిమితం కాకుండా.. ఒక నైపుణ్యం కలిగిన లాంగ్వేజ్ టీచర్‌గా కూడా వ్యవహరిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా కొత్త భాషను నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు.

Google: ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం మరింత ఈజీ.. గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో అదిరే ఫీచర్..
Gemini Ai Powered Live Learning
Krishna S
|

Updated on: Aug 28, 2025 | 10:51 AM

Share

మీరు కొత్త భాష నేర్చుకోవాలని కలలు కంటున్నారా..? లేదా విదేశీ భాషలలో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. గూగుల్ ట్రాన్స్‌లేట్ తన ప్లాట్‌ఫామ్‌లో ఒక సరికొత్త ఏఐ ఆధారిత లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ కేవలం ట్రాన్స్‌లేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ఒక లాంగ్వేజ్ ట్రైనర్‌గా  సహాయపడుతుంది.

డ్యుయోలింగోకి గట్టి పోటీ

ఈ కొత్త ఫీచర్‌తో గూగుల్.. డ్యుయోలింగో వంటి ప్రముఖ భాషా ట్రైనింగ్ యాప్‌లతో నేరుగా పోటీ పడుతోంది. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు మీకు కేవలం అనువాద సాధనం కాకుండా మీ పర్సనల్ లాంగ్వేజ్ ట్రైనర్‌గా మారుతుంది. ఇది ఇప్పటికే కొంత భాష తెలిసిన వారికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ భాషా సామర్థ్య స్థాయిని బేసిక్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు ఎంచుకోవచ్చు. మీ స్థాయి, లక్ష్యాలను బట్టి ఈ యాప్ మీ కోసం ప్రత్యేకంగా వినడం, మాట్లాడటం వంటి ట్రైనింగ్ సెషన్‌లను రూపొందిస్తుంది. ఈ ఫీచర్‌లో గేమిఫైడ్ విధానం ఉంది. అంటే భాష నేర్చుకోవడం ఒక ఆటలా సరదాగా ఉంటుంది. దీని ద్వారా మీరు 40 భాషలను సులభంగా నేర్చుకోవచ్చు.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్ ఒక మాక్ కన్వర్జేషన్ ద్వారా మీకు భాషా నైపుణ్యాలను నేర్పుతుంది. ఉదాహరణకు.. యాప్ మిమ్మల్ని ‘‘భోజన సమయం గురించి అడగమని’’ కోరితే.. మీరు ఆ సంభాషణను వినవచ్చు లేదా సరైన పదాన్ని ఎంచుకుని మాట్లాడటం ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు స్వయంగా మాట్లాడినప్పుడు, యాప్ మీకు తగిన సూచనలు కూడా ఇస్తుంది. మీ రోజువారీ పురోగతిని ట్రాక్ చేయడం ద్వారా, ఇది మీ ట్రైనింగ్ నిరంతరాయంగా కొనసాగించడంలో సహాయపడుతుంది.

ఏ భాషలలో అందుబాటులో ఉంది?

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో ఉంది. ప్రారంభంలో, ఇంగ్లీష్ మాట్లాడేవారు స్పానిష్, ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు. అదే విధంగా స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ మాట్లాడేవారు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉచితంగా అందుబాటులో ఉంది.

గూగుల్ జెమినితో మరింత శక్తివంతంగా

ఈ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌లో గూగుల్ జెమిని ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ట్రాన్స్‌లేషన్ నాణ్యత మరింత మెరుగుపడింది. ఇది కేవలం లాంగ్వేజ్ నేర్చుకోవడానికే కాకుండా సాధారణ ట్రాన్స్‌లేషన్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా నేపథ్య శబ్దాన్ని ఫిల్టర్ చేసి, రియల్ టైమ్ ఆడియో, స్క్రీన్‌పై ట్రాన్స్‌లేషన్‌ను స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, తమిళం, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి అనేక భాషలకు సపోర్ట్ ఇస్తుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి.. మీరు గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను ఓపెన్ చేసి.. ప్రాక్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ నైపుణ్య స్థాయి, టార్గెట్ సెట్ చేసుకుని, మీ లాంగ్వేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయవచ్చు. గూగుల్ యొక్క ఈ కొత్త ఫీచర్ భాష నేర్చుకునే విధానాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పవచ్చు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..