Tech News: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సేవలు.. అసలేం జరిగిందంటే..
గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ న్యూస్, జీమెయిల్ వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు యూజర్లు నెట్టింట పోస్ట్‌లు చేస్తున్నారు. క్రౌడ్ సోర్ట్స్ అవుట్‌టేజ్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జీమెయిల్‌తో పాటు గూగుల్ సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు....

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సెర్జ్ ఇంజన్‌లో గూగుల్ సేవలు నిలిచిపోయాయి. పలు దేశాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు నిలిచిపోయాయని నివేదికలు చెబుతున్నారు.
గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ న్యూస్, జీమెయిల్ వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు యూజర్లు నెట్టింట పోస్ట్‌లు చేస్తున్నారు. క్రౌడ్ సోర్ట్స్ అవుట్‌టేజ్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జీమెయిల్‌తో పాటు గూగుల్ సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. గూగుల్ సేవలకు సంబంధించి వెయ్యికిపైగా నివేదికలు వచ్చాయి.
Google News down today… Sometimes it may load, but rarely…
— Eliot the Cougar 🇺🇦🇪🇺🇺🇸 (@eliotcougar) May 31, 2024
వీరిలో సుమారు 66 శాతం మంది గూగుల్ వెబ్‌సైట్‌తో సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. 21 శాతం మంది గూగుల్ సెర్చ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక మిగిలిన 3 శాతం మంది మ్యాప్స్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని తెలిపారు. వీటితో పాటు గూగుల్ న్యూస్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.
Is Google down for anyone else?
— Ric is editing CONT/EXT (@grislyeye) May 31, 2024
ఇక గూగుల్ సెర్చ్‌లో ఇబ్బందులు వస్తుండంపై పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ట్విట్టర్‌లో స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. వీటిలో గూగుల్ సెర్చ్ మొదలు, న్యూస్ వరకు తలెత్తుతోన్న ఇబ్బందులను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
Is Google News down? pic.twitter.com/SGwwW6hE3c
— Tony Muchiri (@TonyMuchiri4) May 31, 2024
Either google news is down, or defence cuts really are a thing. pic.twitter.com/Pe91Tg0afm
— Dr Iain Overton (@iainoverton) May 31, 2024
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




