AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగ్నల్ లేకున్నా వాట్సాప్ కాల్స్.. సరికొత్త టెక్నాలజీతో వస్తున్న మొబైల్‌ ఫోన్‌.. ఏదో తెలుసా?

ఫోన్‌లో సిగ్నల్‌ లేకపోతే మన దగ్గర ఫోన్‌ ఉన్నా, లేకున్నా ఒక్కటే.. కొన్నిసార్లు ఫుడ్‌ లేకపోయినా ఉంటారేమో కానీ సిగ్నల్‌ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేరు. అయితే ఈ నెట్‌వర్క్‌ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో సిగ్నల్‌ లేకున్నా కూడా వాట్సాప్‌ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇంతకు ఈ ఫీచర్ ఏంటి.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

సిగ్నల్ లేకున్నా వాట్సాప్ కాల్స్.. సరికొత్త టెక్నాలజీతో వస్తున్న మొబైల్‌ ఫోన్‌.. ఏదో తెలుసా?
Satellite Whatsapp Calls
Anand T
|

Updated on: Aug 23, 2025 | 1:04 PM

Share

ఫోన్‌లో సిగ్నల్‌ లేకపోతే మన దగ్గర ఫోన్‌ ఉన్నా, లేకున్నా ఒక్కటే.. ఎందుకంటే ఫోన్‌లో సిగ్నల్‌ లేకపోతే మనకు ప్రపంచంతో ఎలాంటి కనక్షన్ ఉండదు. మనం ఇంటర్నెట్‌ను వినియోగించలేము. ఎలాంటి కాల్స్‌ చేయలేము. కానీ ఇకపై సిగ్నల్స్‌ లేకున్నా కాల్స్‌ చేసుకోవచ్చి ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ చెబుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు తాము ఇటీవలే రిలీజ్‌ చేసి గూగుల్‌ పిక్సల్‌ 10 సిరీలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఇది సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సాధ్యమవుతుంది, ఇది పిక్సెల్ 10 ను ఈ ఫీచర్‌తో వచ్చే మొదటి ఫోన్‌గా నిపుతుందని గూగుల్ చెబుతోంది.

ఈ నెల 20న జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్‌ను ఆవిష్కరించిన గూగుల్‌ తాజాగా ఈ ఫోన్‌లో ఈ సరికొత్త ఫీచర్‌ను యాడ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆగస్ట్‌ 28 నుంచి అందుబాటులోకి వచ్చే గూగుల్‌ పిక్సెల్ 10 ఫోన్లుతో పాటు ఈ శాటిలైట్ కాలింగ్ ఫీచర్‌ను కూడా ఆదే రోజు ప్రారంభించనున్నట్టు గూగుల్‌ తెలిపింది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

గూగుల్‌ పిక్సల్ 10 ఫోన్‌ యూజర్‌ సిగ్నల్‌, వైఫై కవరేజ్‌ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు.. ఆఫోన్‌ స్టేటస్ బార్‌లో ఒక శాటిలైట్ ఐకాన్ కనిపిస్తుంది. అప్పుడు మనం వాట్సాప్‌ నుంచి ఎవరికైనా, ఆడియో లేదా వీడియో కాల్‌ చేసినా, లేదా మనకు వచ్చినా.. అది శాటిలైట్‌ నెట్‌వర్క్ ద్వారా కెనెక్ట్‌ అవుతుంది. దాని ద్వారా మనం వీడియో, ఆడియో కాల్స్‌ను మాట్లాడవచ్చు. ఈ ప్రిక్రియ కూడా మన సాధారణ కాలింగ్ మాదిరిగానే ఉంటుందని.. ఇందుకు సంబంధించి గూగుల్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌లో పేర్కొంది.

ప్రపంచంలోనే తొలి ఫోన్‌గా గూగుల్ పిక్సెల్ 10

అయితే ఈ టెక్నాలజీ సక్సెస్‌ అయితే వాట్సాప్ ద్వారా శాటిలైట్ కాలింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గూగుల్ పిక్సెల్ 10 నిలవనుంది. కానీ ఈ సేవలు కొన్ని ఎంపిక చేసిన టెలికం సంస్థల ద్వారా మాత్రమే పనిచేస్తాయని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను పొందేందుకు అదనపు చార్జీలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.