Google Password: ఇక పాస్ వర్డ్ లేకుండానే గూగుల్ ఉపయోగించవచ్చు.. ఎలాగో తెలుసా..?

ఇప్పుడు దాదాపుగా అందరూ గూగుల్ సర్వీసులు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. జీ మెయిల్.. నుంచి గూగుల్ మేప్స్ వరకూ.. అన్నిటినీ వాడేస్తున్నారు. అయితే, గూగుల్ సర్వీసులను ఉపయోగించుకునే వారు.. పాస్ వర్డ్ ద్వారా తమ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ..

Google Password: ఇక పాస్ వర్డ్ లేకుండానే గూగుల్ ఉపయోగించవచ్చు.. ఎలాగో తెలుసా..?
Google
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2023 | 6:45 AM

ఇప్పుడు దాదాపుగా అందరూ గూగుల్ సర్వీసులు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. జీ మెయిల్.. నుంచి గూగుల్ మేప్స్ వరకూ.. అన్నిటినీ వాడేస్తున్నారు. అయితే, గూగుల్ సర్వీసులను ఉపయోగించుకునే వారు.. పాస్ వర్డ్ ద్వారా తమ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ, చాలామంది పాస్ వర్డ్స్ ను మరచిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పాస్ వర్డ్స్ హ్యాకర్ల చేతిలో పది యూజర్ల విలువైన సమాచారం చోరీకి గురావుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో గూగుల్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది.

అంతర్జాతీయ పాస్‌వర్డ్‌ దినోత్సవం సందర్భంగా యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటా మే నెల మొదటి గురువారం రోజున వరల్డ్‌ పాస్‌వర్డ్‌ డేగా జరుపుతారు. ఈ క్రమంలోనే గూగుల్ పాస్‌కీస్‌ (Google Passkeys) ఫీచర్‌ను పరిచయం చేసింది. తరచూ తమ ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌ మర్చిపోయే యూజర్లకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో యూజర్లు తమ ఆన్‌లైన్‌ ఖాతాలను పాస్‌వర్డ్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ అవసరం లేకుండా ఫింగర్‌ప్రింట్, ఫేస్‌ స్కాన్‌ లేదా స్క్రీన్‌ లాక్‌ పిన్‌ సాయంతో లాగిన్‌ చేయొచ్చు. అలాగే యూజర్ల ఖాతాలకు అదనపు భద్రత ఉంటుందని గూగుల్ తెలిపింది.

గూగుల్ యూజర్లు ఈ ఫీచర్‌ను ముందుగా ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం గూగుల్‌ ఖాతా ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్‌ యువర్‌ గూగుల్ అకౌంట్‌ (Manage Your Google Account)పై క్లిక్‌ చేసి సెక్యూరిటీ సెక్షన్‌లోకి వెళితే పాస్‌కీస్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే మీ ఖాతాకు పాస్‌కీస్‌ ఫీచర్‌ యాక్టివేట్ అయినట్లు మెసేజ్‌ చూపిస్తుంది. మొబైల్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ స్కాన్‌ ఆప్షన్లతో పాస్‌కీ ఆటోమేటిగ్గా క్రియేట్ అవుతుంది. లేదా క్రియేట్‌ పాస్‌కీ ఆప్షన్‌తో యూజర్‌ కొత్త కీని క్రియేట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్‌ లాగిన్‌ కోసం పిన్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌, ఫేస్‌ స్కాన్‌లలో ఏ ఒక్కటి ఎనేబుల్‌ చేయకపోతే వాటిని ఎనేబుల్ చేయమని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కీబోర్డ్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఆప్షన్‌ ఉంటే పాస్‌కీ క్రియేట్ చేసుకోవచ్చు. పెన్‌డ్రైవ్‌ల తరహాలో ఉండే కొన్ని పాస్‌కీస్‌ యూఎస్‌బీ డ్రైవ్‌లను కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొన్ని మొబైల్‌ యాప్‌లకు ఫింగర్‌ ప్రింట్ అథెంటికేషన్‌ తరహాలో గూగుల్ ఖాతాలకు పాస్‌కీస్‌ పనిచేస్తాయి. పాస్‌వర్డ్‌ల తరహాలో గుర్తుంచుకోవడం కోసం వీటిని ఎక్కడా రాయాల్సిన అవసరంలేదు. ఒకవేళ కొత్తగా ఏదైనా డివైజ్‌లో గూగుల్ ఖాతా లాగిన్‌ చేసేప్పుడు పాస్‌వర్డ్‌ ఆప్షన్‌కు బదులు పాస్‌కీస్‌ ఆప్షన్‌ను ఎంచుకుని ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ స్కాన్‌, పిన్‌ సాయంతో లాగిన్‌ చేయొచ్చు. దానివల్ల ఇతరులు గూగుల్‌ ఖాతాలను యాక్సెస్‌ చేయలేరు. అయితే, ఈ ఫీచర్‌ కోసం డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11, యాపిల్‌ మ్యాక్‌ఓఎస్‌ వెంచురా ఓఎస్‌లతో.. మొబైల్‌లో ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 16 ఆపై వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తుండాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి