Banking: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఈ మార్పులు గమనించకపోతే నష్టపోతారు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్యాంకులు మే ఒకటో తేదీ నుంచే డెబిట్, క్రెడిట్ కార్డుల చార్జీలు, ఆఫర్ల విషయంలో పలు మార్పులు చేసి, అమలు చేస్తున్నాయి. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ మే 22 నుంచి డెబిట్ కార్డు వినియోగంపై పలు సవరణలు అమలు చేయనుంది.

Banking: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఈ మార్పులు గమనించకపోతే నష్టపోతారు..
Credit Card
Follow us
Madhu

|

Updated on: May 05, 2023 | 2:39 PM

ప్రస్తుత కాలంలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వినియోగించని వారు లేరు. డెబిట్ కార్డులు ఏటీఎంలలో, క్రెడిట్ కార్డులు ఆన్ లైన్ షాపింగ్ల కోసం వినియోగిస్తుంటారు. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగిసిన తర్వాత అన్ని ఫైనాన్షియల్ కంపెనీలు ఏప్రిల్, మే మాసాలలో కొన్ని కొత్త స్కీమ్ లు, నూతన విధానాలు, చార్జీల్లో మార్పులను చేస్తాయి. అందునా మే నెల చాలా కీలకం. మీరు ఖాతా కలిగి ఉన్న బ్యాంకులు ఏమేమి మార్పులు చేశారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్యాంకులు మే ఒకటో తేదీ నుంచే డెబిట్, క్రెడిట్ కార్డుల చార్జీలు, ఆఫర్ల విషయంలో పలు మార్పులు చేసి, అమలు చేస్తున్నాయి. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ మే 22 నుంచి డెబిట్ కార్డు వినియోగంపై పలు సవరణలు అమలు చేయనుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్పులు ఇలా..

ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డు అందించే ఆరమ్(ఏయూఆర్యూఎం) కార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్(ఎస్బీఐ కార్డ్) పలు మార్పులు చేసింది. ఇప్పుడు ఆరమ్ క్రెడిట్ కార్డుదారులు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతారు. ఇంతకు ముందుకు ఏడాదికి రూ. 5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన కార్డుదారుడకు ఆర్బీఎల్ లగ్జ్ నుంచి ఈ వోచర్ వచ్చేది. అలాగే ఆరమ్ కార్డు ద్వారా వచ్చే ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను కూడా తొలగించింది. అలాగే సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు, సింప్లీ క్లిక్ అడ్వాన్టేజ్ ఎస్బీఐ కార్డు దారులకు ఆన్ లైన్ రెంట్ పేమెంట్లపై వచ్చే రివార్డులను 5 నుంచి ఒకటి తగ్గించింది. అలాగే క్యాష్ బ్యాక్ కార్డు వినియోగదారులకు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ ప్రయోజనాలను కూడా తొలగించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చేయాలనుకొని, దానిలో నగదు లేకుండా లావాదేవీ ఫెయిల్ అయితే రూ. 10 ప్లస్ జీఎస్టీ ని బ్యాంకు వసూలు చేస్తుంది. ఇది మే ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చింది. అలాగే డెబిట్ కార్డు ఇన్సురెన్స్, వార్షిక ఫీజులను రివైజ్ చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. త్వరలో వీటిని ప్రకటిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కోటక్ మహీంద్ర బ్యాంక్..

ఈ బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డు చార్జీలను రూ. 259 ప్లస్ జీఎస్టీ వరకూ పెంచినట్లు ప్రకటించింది. ఈ చార్జీలు 2023 మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అంతకు ముందు డెబిట్ కార్డు పై చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..