Odysse Electric Hawk: ట్రెండీ లుక్.. స్టన్నింగ్ ఫీచర్లతో కొత్త ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 170 కిమీ రేంజ్..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఒడిస్సీ ఎలక్ట్రిక్ హాక్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ మంచి ట్రెండీ లుక్ లో కనిపిస్తోంది. అలాగే రేంజ్ కూడా బెస్ట్ ఇన్ ద మార్కెట్ అన్నట్లుగా 170 కిలోమీటర్లు ఉంది.

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. వినియోగదారులు మంచి ఫీచర్లతో పాటు తక్కువ ధరలో అధిక రేంజ్ ఇచ్చే స్కూటర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు కూడా అందుకు తగినట్లుగానే తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఒడిస్సీ ఎలక్ట్రిక్ హాక్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ మంచి ట్రెండీ లుక్ లో కనిపిస్తోంది. అలాగే రేంజ్ కూడా బెస్ట్ ఇన్ ద మార్కెట్ అన్నట్లుగా 170 కిలోమీటర్లు ఉంది. ధర కూడా అందుబాటులో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకొనే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ఒడిస్సీ ఎలక్ట్రిక్ హాక్ స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్పెసిఫికేషన్లు ఇలా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1800వాట్ అవర్ మోటార్ ఉంటుంది. లైట్ వెయిట్ డిజైన్ లో ఈ స్కూటర్ ను తయారు చేశారు. స్కూటర్ బరువు 128 కేజీలు ఉండగా.. ఇది 150 కేజీలు మోయగలుగుతుంది. వెనుక వైపు డ్రమ్ బ్రేకులు, ముందు వైపు డిస్క్ బ్రేకులు ఉంటాయి.
బ్యాటరీ సామర్థ్యం.. దీనిలోని బ్యాటరీ 2.96 కిలోవాట్ల సామర్థ్యంతో ఉంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.



ఫీచర్లు.. దీనిలో అనేక బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది డిజిటల్ కన్సోల్, బ్లూ టూత్ కనెక్టవిటీ, యూఎస్ బీ చార్జింగ్ స్టేషన్, మ్యూజిక్ సిస్టమ్, థెఫ్ట్ అలారం ఉంటుంది. ఖరీదైన లిథియం అయాన్ మోడల్ లో క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. అల్లాయ్ వీల్స్ ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి.
ధర, లభ్యత.. ఈ ఒడిస్సీ ఎలక్ట్రిక్ హాక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. హాక్, హాక్ ప్లస్ గా అందుబాటులో ఉంది. లైట్ వెర్షన్ ధర రూ. 99,400 నుంచి ప్రారంభమవుతుండగా.. హాక్ ప్లస్ మోడల్ రూ. 1.17 లక్షల వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..